ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు చిత్తుగా ఓడింది. 54 పరుగుల తేడాతో ఓడి ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. మిగిలి ఉన్న లీగ్ మ్యాచ్‌ను కచ్చితంగా గెలిచి తీరాల్సిన సందర్భం వచ్చింది. కాగా.. పంజాబ్ చేతిలో ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్పందించాడు. ‘పంజాబ్ కింగ్స్ చేసిన స్కోర్ చాలా మంచిది. జానీ బెయిర్ స్టో ఆరంభంలోనే మా బౌలర్లపై విరుచుకుపడి ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే ఆ తర్వాత మేం అద్భుతంగా పుంచుకున్నాం. ఈ వికెట్‌పై 200 పరుగుల లక్ష్యం అంత కష్టమేమీ కాదు. అయితే ఇలాంటి భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు వెనువెంటనే వికెట్లు కోల్పోకూడదు. కానీ దురదృష్టవశాత్తు మేం అదే తప్పిదం చేశాం.
కోహ్లీ బ్యాడ్ ఫేజ్ కొనసాగుతోంది. అతను ఎలా ఆడినా ఔటవ్వడమే జరుగుతోంది. సానుకూలంగా ఉంటూ మరింత కష్టపడితేనే ఈ బ్యాడ్ ఫేజ్‌ను దాటగలడు. ఈ రోజు విరాట్ అద్భుతమైన షాట్స్ ఆడాడు. ఆ జోరును అలానే కొనసాగించాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. బ్యాడ్ ఫేజ్‌లు ఆటగాళ్లకు సహజమే. ఈ రోజు అతను దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. ఈ రోజును మేం వీలైనంత త్వరగా మరిచిపోయి తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం పకడ్బందీ ప్రణాళికలు రెడీ చేస్తాం. నెట్స్‌లో శ్రమించినంత మాత్రానా గొప్ప ప్లేయర్స్ కాలేం. మానసికంగా ధృడంగా ఉండాలి. మా సామర్థ్యం మేరకు ఆడితే మేం ఈ మ్యాచ్‌లో గెలిచేవాళ్లం. మాది చాలా బలమైన టీమ్. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు.’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
కాగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించాడు. చూడచక్కటి షాట్లు ఆడాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఇక సిక్స్‌తో 20 పరుగులు చేసి ఫామ్‌లోకి వస్తున్నట్లు కనిపించాడు. కానీ.. దురదృష్టవశాత్తు రబడా వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను పుల్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతి బ్యాట్‌కు తకకున్నా.. అతని గ్లౌజ్‌కు చిన్నగా తగిలింది. తర్వాత థైప్యాడ్ పైఅంచుకు తగిలి ఫీల్డర్ చేతుల్లో పడింది. అంపైర్ అవుట్ ఇవ్వకున్నా.. పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్‌చేయడంతో థర్డ్ అంపైర్ పరిశీలించి అవుట్‌గా ప్రకటించాడు. దీంతో కోహ్లీ ఎంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), జానీ బెయిర్ స్టో(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా.. హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. షెహ్‌బాజ్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. రిషి ధావన్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది. మరి ఈ మ్యాచ్‌లో ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: మరోసారి వెంటాడిన దురదృష్టం! బాగా ఆడుతూ అవుటైన కోహ్లీ
Skipper Faf gives his thoughts after a tough night at the Brabourne and is confident that we’ll come good in our final group stage match. #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/2koEoFEgSb
— Royal Challengers Bangalore (@RCBTweets) May 14, 2022
#ViratKohli𓃵 : “What else do you want me to do? Fuck me.”
Heart touching 😭😭#RCBvsPBKS #RCB pic.twitter.com/w1JWxEKOxU
— CHANDRAKANTH (@ChandraSpeakss) May 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.