ఐపీఎల్ 2022లో దినేష్ కార్తీక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్‌లో ఆర్సీబీకి తన పవర్ హిట్టింగ్‌తో ఊహించని ఫినిష్ ఇస్తున్నాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా డీకే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొన్న డీకే ఒక ఫోర్ నాలుగు సిక్సులు బాది 30 పరుగులు చేశాడు. 300 పైచిలుకు స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. దీంతో 160 పరుగుల వరకు చేస్తుందనుకున్న ఆర్సీబీ 192 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో ఒక్కసారిగా మూమెంటమ్ మొత్తం ఆర్సీబీ వైపు మారిపోయింది. డీకే ఇచ్చిన ఊపుతో ఆర్సీబీ బౌలర్లు సన్‌రైజర్స్‌ను కేవలం 125 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో కీలక పోరులో ఆర్సీబీ 67 పరుగులతో విజయం సాధించింది.
ఈ సీజన్‌లో ఆడుతున్నట్లు డీకే గతంలో ఎప్పుడూ ఆడలేదు. ముఖ్యంగా చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్న స్టైల్ చూస్తుంటే.. టీమిండియా ఇలాంటి ప్లేయర్ అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. డెత్ ఓవర్స్‌లో ఎలాంటి బౌలర్‌నైనా ఎదుర్కొంటూ అలవొకగా సిక్సులు కొడుతూ ఇన్నింగ్స్ ముగింపులో టీమ్‌కు కావాల్సిన ఆ జోష్ వంద శాతం అందిస్తున్నాడు. ప్రస్తుతం డీకే ఉన్న ఫామ్ దృష్ట్యా అతన్ని టీ20 వరల్డ్ కప్ కోసం జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతుంది. పైగా ప్రస్తుతం టీమిండియా కీపర్ కమ్ బ్యాటర్‌గా ఉన్న రిషభ్ పంత్ అంతగా రాణించిలేకపోవడంతో కూడా డీకేను తీసుకోవాలన్న డిమాండ్‌కు మరో కారణం.సెలక్టర్లు కూడా డీకేను జట్టులోకి తీసుకునే విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. కానీ.. పంత్ స్థానంలో డీకేను తీసుకుంటారా? లేక పంత్‌ను కొనసాగిస్తూ డీకేను జట్టులోకి తీసుకుంటారా అనే విషయంలో మాత్రం అంతగా స్పష్టత లేదు. నిజానికి టీమిండియా డీకే లాంటి ఫినిషర్ అవసరం చాలా ఉంది. గతంలో ధోని అలాంటి ఫినిషింగ్ టీమిండియాకు అందించేవాడు. కానీ అతను రిటైర్ అయిన తర్వాత.. టీమిండియా బెస్ట్ ఫినిషర్ లోటు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కార్తీక్ కనీసం టీ20 వరల్డ్ కప్‌లోనైనా ఆ లోటును తీర్చుతాడనే ఆశ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Faf Du Plessis: SRHతో మ్యాచ్‌లో త్వరగా అవుటై.. పెవిలియన్ వెళ్లాలనుకున్నా: డుప్లెసిస్
#IPL2022: All hail ‘finisher’ Dinesh Karthik – Is there another India comeback on the horizon?
READ: https://t.co/cH3LGnrAjI 🏏#DineshKarthik pic.twitter.com/Z4j5T3Oq53
— TOI Sports (@toisports) May 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.