‘యూనివర్సెల్ బాస్’ క్రిస్ గేల్ లేకుండా ఐపీఎల్ ను ఊహించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. కానీ, అలాంటి పరిస్థితి వచ్చేస్తోంది అంటున్నారు. క్రిస్ గేల్ వచ్చే ఐపీఎల్ వేలంలోకి వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మాట నిజమైతే అది కచ్చితంగా క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఐపీఎస్- 2022 మెగా వేలంలోకి వచ్చేందుకు గేల్ సుముఖతగా లేడని సమాచారం. అయితే సడెన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న.
Chris Gayle not putting his name for the ipl 2022 megaauction#ChrisGayle #IPLAuction2022 pic.twitter.com/SNrWOb6tap
— Cricket Mirror (@cricket_mirror7) January 22, 2022
క్రిస్ గేల్ ఎందుకు ఐపీఎల్-2022 ఆడాలని అనుకోవట్లేదు? అనే ప్రశ్నకు కొందరు పంజాబ్ ఫ్రాంచైంజ్ యాజమాన్యాన్ని కారణంగా చూపుతున్నారు. గత సీజన్ లో దాదాపు చాలా మ్యాచ్ లలో క్రిస్ గేల్ కు అవకాశం కల్పించలేదు. అవకాశమిచ్చిన మ్యాచ్ లలో ఓపినింగ్ ఛాన్స్ ఇవ్వలేదు. 42 ఏళ్ల వయసులో గేల్ ఇప్పుడు ఐపీఎల్ లోకి వచ్చినా.. అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతారా? ఒకవేళ ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాకపోతే? ఇన్నాళ్లు గేల్ సంపాదించుకున్న పేరు, పరపతి మొత్తం పోయినట్లు అవుతుందిగా? ఇప్పటికే క్రిస్ గేల్ ఆప్షన్ కాదు అన్నట్లు గత సీజన్ లో పంజాబ్ టీమ్ ప్రవర్తించింది. ఒకవేళ తీసుకున్నా అదే పరిస్థితి రిపీట్ కాదు అని గ్యారెంటీ లేదు. ఇవ్వన్నీ దృష్టిలో ఉంచుకొని క్రిస్ గేస్ ఐపీఎల్ వేలంలోకి వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపలేదని తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు లెజెండ్స్ ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ శకం ముగిసింది అంటూ భావోద్వేగంగా కామెంట్ చేస్తున్నారు. క్రిస్ గేల్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.