ప్రస్తుతం హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు మరింత బిజీ కానున్నారు. ఐపీఎల్ మరో రెండు వారాల్లో ముస్తుంది. దీని వెంటనే సౌతాఫ్రికాతో స్వదేశంలో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. వెంటనే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యాటనకు భారత్ జట్టు వెళ్తుంది. అనంతరం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ఖరారు చేసింది. వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఐదు టీ20ల్లో చివరి రెండింటినీ అమెరికాలో నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించింది బీసీసీఐ. అక్కడ క్రికెట్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జులై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. అదే నెల 29వ తేదీన సెయింట్ కీట్స్‌లోని బ్రియాన్ ఛార్లెస్ లారా స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌ను ఆడతాయి. ఈ రెండు జట్లు. ఆగస్టు 1, 2 తేదీల్లో నెవిస్‌లోని వార్నర్ పార్క్‌లో బ్యాక్ అండ్ బ్యాక్ టీ20ల్లో తలపడతాయి. ఈ మూడు మ్యాచ్‌ల అనంతరం భారత్, వెస్టిండీస్ జట్లు అమెరికాకు బయలుదేరి వెళ్తాయి. ఆగస్టు 6,7 తేదీల్లో ఫ్లోరిడాలో చివరి రెండు టీ20లను ఆడతాయి. ఇలా తిరికలేని మ్యాచ్‌లతో బిజీగా ఉండే.. టీమిండియాను బీసీసీఐ రెండు జట్లుగా విభజించే అవకాశం ఉంది.
టెస్ట్ ఫార్మట్ కోసం ప్రత్యేకంగా సీనియర్ ప్లేయర్లతో కూడిన జట్టును ఇంగ్లాండ్ పర్యటనకు పంపిస్తుందని సమాచారం. అలాగే వన్డే, టీ20 స్పెషలిస్టులతో మరో టీమ్‌ను వెస్టిండీస్ టూర్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. కాగా బీసీసీఐ గతంలోనే ఇలాంటి ప్రయోగం చేసింది. ఇంగ్లాండ్‌లో సీనియర్ టీమ్ టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతున్న సమయంలో జూనియర్లతో ఏర్పాటు చేసిన జట్టును శ్రీలంకకు పంపించిన విషయం తెలిసిందే. మరి ఇలా రెండు టీమ్స్ విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: గేల్, పొలార్డ్, డివిలియర్స్, కోహ్లీ తర్వాత లిస్టులో చేరిన రోహిత్ శర్మ
NEWS 🚨 – BCCI announces venues for home series against South Africa.
More details 👇 #INDvSA #TeamIndia https://t.co/suonaC39wR
— BCCI (@BCCI) April 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.