‘ఐపీఎల్ 2022’ మెగా వేలానికి రంగం సిద్ధమవుతోంది. అన్ని జట్లు తమ రిటెన్షన్ లిస్టును ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ కూడా ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్ లను రిటైన్ చేసుకుంది. పంజాబ్ గత కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం మెగా వేలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయంలో చాలా రోజులు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. పంజాబ్ యాజమాన్యంపై రాహుల్ అసంతృప్తిగా ఉన్నాడని వేలానికి వెళ్తాడని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. అదే నిజం అయ్యింది. ఈ విషయంపై ప్రీతీ జింటా నేరుగా స్పందించలేదు. కుంబ్లే మాత్రం స్పందించాడు.
A 🆕 direction for a 🆕look team 💫
Know more about the #IPLRetentions👇#SaddaPunjab #PunjabKingshttps://t.co/8vK2K7uI1V
— Punjab Kings (@PunjabKingsIPL) November 30, 2021
పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్ కు మ్యాక్సిమమ్ రిటైన్ ప్రైస్ రూ.16 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా రాహుల్ మాత్రం అందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్ ను వదులుకునే ఉద్ధేశం పంజాబ్ కు లేదు. కానీ, రాహుల్ కావాలనే వేలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ విషయంపై పంజాబ్ డ్రెస్సింగ్ రూమ్ లో చాలా రోజుల నుంచి సంప్రదింపులు, చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ప్రీతి జింటా కూడా రాహుల్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా రాహుల్ పై సీరియస్ అయినట్లు సమాచారం. బయటకి మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు.
కేఎల్ రాహుల్ తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు. ‘నేను పంజాబ్ తో జత కలిసినప్పటి నుంచి రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు. మేము రాహుల్ ను రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, రాహుల్ మాత్రం అందుకు నిరాకరించాడు. రిటైన్ రూల్స్ ప్రకారం ప్లేయర్ కావాలనుకుంటే ఆక్షన్ వెళ్లచ్చు.. అది అతని నిర్ణయం. మేము రాహుల్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అంటూ అనిల్ కుంబ్లే తెలిపాడు.
Thoughts from the Head of the Head Coach! 😎
Listen in to @anilkumble1074 🗣#SaddaPunjab #PunjabKings #IPL2022Retention #IPLRetention pic.twitter.com/kO3EX1scg2
— Punjab Kings (@PunjabKingsIPL) November 30, 2021