సీఎస్కే ఫ్యాన్స్ కు గట్టి షాకే తగిలేలా ఉంది. ధోనీ ఏరికోరి జట్టులోకి తెచ్చుకున్న యువ ఆటగాడిపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. అండర్-19 ప్రపంచకప్ విన్నింగ్ మెంబర్ రాజవర్ధన్ హంగర్కర్ పై వయసుకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. అతడు మోసానికి పాల్పడ్డాడు అంటూ మహారాష్ట్ర క్రీడా, యువజన విభాగం కమిషనర్ ఓంప్రకాశ్ బకోరియా ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి బీసీసీఐకి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. అతడిని మెగా ఆక్షన్ లో సీఎస్కే రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ఓం ప్రకాశ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారడంతో అతని వయసుపై విచారణ చేశారు. ‘ధారాశివ్ పబ్లిక్ స్కూల్ లో ఉన్న వివరాల ప్రకారం అతడు 2001 జనవరి 10న జన్మించినట్లుగా ఉంది. ఆ తర్వాత అతను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో 2002 నవంబరు 10గా మార్చినట్లు ఉంది’ అని ఓం ప్రకాశ్ తన లేఖలో వెల్లడించారు. ఈ అంశంపై బీసీసీఐ వర్గాలు ఇన్ సైడర్ స్పోర్ట్ తో స్పందించాయి. ‘రాజవర్ధన్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అప్పుడే ఒక అంచనాకి రాలేం. వ్యవస్థలపై మాకు నమ్మకం ఉంది. ఆ అంశంలో లోతుగా విచారణ జరుపుతాం’ అంటూ బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా అండర్-19 ప్రపంచ కప్ విజయంలో రాజవర్ధన్ కూడా కీలక పార్త పోషించాడు. ఈ యువ ఫాస్ట బౌలర్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విరసరగలడు. ధోనీ కూడా రాజవర్ధన్ పై ప్రత్యేక ఆసక్తి చూపినట్లు సమాచారం. అందుకే సీఎస్కే అతడిని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. మరి, ఏరి కోరి తెచ్చుకున్న యువ ఆటగాడిపై ఇలాంటి సంచలన ఆరోపణలు రావడంతో సీఎస్కే అభిమానులు షాక్ లో ఉన్నారు.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.