‘ఏ సాలా కప్ నమ్దే’ అంటూ ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో దూసుకుపోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. 11 మ్యాచుల్లో 7 గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది ఆర్సీబీ. బెంగళూరు విజయాల్లో మొదటి నుంచి కీలకంగా వ్యవహరించేది స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టగలడు. మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్ రూమ్, డగౌట్, సోషల్ మీడియా స్టేజ్ ఏదైనా తనదైనశైలిలో అభిమానులను నవ్విస్తుంటాడు చాహల్. తాజాగా అలా మ్యాక్స్‌వెల్‌ను ఆటపట్టించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి చాహల్..! టీమ్ మారుతోందా?
ఇవీ చదవండి: చాహల్ ని వరల్డ్ కప్ కి ఎందుకు ఎంపిక చేయలేదు? సెలెక్టర్స్ సెహ్వాగ్ సూటి ప్రశ్న
రాజస్థాన్‌తో మ్యాచ్ జరుగుతుండగా.. కామెంటేటర్లు ఆర్సీబీకి మూడోస్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తే బావుంటుంది అంటూ ప్రశ్న అడుగుతారు. అందుకు కేఎస్ భరత్, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ అంటూ ఆప్షన్స్ ఇచ్చారు. అక్కడ కూర్చున్న మ్యాక్స్‌వెల్ అది చాహల్‌కు చూపగా అందుకు చాహల్ ఎవరో ఎందుకు నేనే వెళ్తా అంటూ సైగ చేస్తాడు. కామెంటేటర్లు చాహల్‌ను చూసి అవును చాహల్ పేరు ఎందుకు ఇవ్వకూడదు. అతను కూడా ఒక ఆప్షన్ కావచ్చు కదా అంటూ మాట్లాడుకుంటారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీబీ ఈ సీజన్‌లో కప్పు కొడుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.
— pant shirt fc (@pant_fc) September 29, 2021