ఇషాన్ కిషన్‌కి విరాట్ కోహ్లీ క్లాస్! మ్యాచ్ అనంతరం సీరియస్! వీడియో వైరల్

దుబాయ్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయకేతనం ఎగురవేసింది. అనూహ్యంగా ముంబయి ఇండియన్స్‌పై ఆర్సీబీ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి165 పరుగులు చేసింది. కోహ్లీ(51), మ్యాక్స్‌వెల్‌(56) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ మంచి స్కోర్‌ చేయగలిగింది. 166 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి బంగపాటు తప్పలేదు. ఓపెనర్లు రోహిత్‌(43), డీకాక్‌(24) మినహా ఏ ఒక్క ముంబయి ఆటగాడు రెండంకెల స్కోర్‌ చేయలేదు. మ్యాక్స్‌వెల్‌ ఈసారి బాల్‌తోనూ ఆకట్టుకున్నాడు. రోహిత్‌, కృనాల్‌ రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. పదిలో ఆరు మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది.

ఇషాన్‌కు విరాట్‌ కోహ్లీ క్లాస్‌

మ్యాచ్‌ తర్వాత మైదానంలో ఓ అద్భుతమైన సంఘటన అందరినీ ఆకట్టుకుంది. ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ సీరియస్‌గా మాట్లాడుకుంటూ కనిపించారు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఇషాన్‌ కిషన్‌ ప్రదర్శన అసలేం బాలేదు. ఆర్సీబీ మ్యాచ్‌లోనూ 12 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. పాజిటివ్‌ అప్రోచ్‌ తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. ఇషాన్‌కు అతని బ్యాటింగ్‌పై కాన్ఫిడెన్స్‌ కనిపించడం లేదు. భయపడుతూ ఆడుతున్నట్లే కనిపిస్తున్నాడు. ఏ షాట్‌ కూడా కాన్ఫిడెంట్‌గా కొట్టడం లేదు. ఆ విషయం మీదే విరాట్‌ కూడా ఇషాన్‌తో మాట్లాడాడు. రానున్న టీ20 వరల్ట్‌ కప్‌ స్క్వాడ్‌లో ఉన్న ఇషాన్‌ మంచి ఇన్నింగ్సులు ఆటకపోతే తర్వాత టీమిండియాపైనే ఆ ప్రభావం ఉంటుంది. అది దృష్టిలో ఉంచుకునే ఐపీఎల్‌ సంగతి పక్కన పెట్టి బాగా బ్యాటింగ్‌ చేయాలంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అతని బ్యాటింగ్‌లో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాడో సూచించాడు. బాగా ఆడాల్సిందిగా ఒకింత సీరియస్‌గానే క్లాస్‌ పీకాడు.

ఐపీఎల్‌లో ప్రత్యర్థి ఆటగాడిగా కాకుండా.. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ, ఇషాన్‌కు మెళకువలు చెప్పడంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV