మహేంద్ర సింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఈ పేరుకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్డ్ అయినా, ఐపీఎల్ లో సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నా.. తలైవా క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. రాబోయే టీ-ట్వంటీ వరల్డ్ కప్ కోసం బీసీసీఐ బాస్ గంగూలీ ఏకంగా ధోనిని మెంటర్ గా నియమించాడంటే మహీ భాయ్ స్థాయి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. మరి.. ఇంత గొప్ప ఆటగాడు ముందు.. ఎవరైనా పిల్ల ఆటలు ఆడితే ఎలా ఉంటుంది. ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇదే పని చేసి.. కష్టాలను కొని తెచ్చుకున్నాడు. చెన్నై ముంబై జట్ల మధ్య దుబాయ్ లో జరిగిన మ్యాచ్ ఇందుకు వేదిక అయ్యింది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై మొదట్లో కాస్త తడబడింది. పాతిక పరుగులు కూడా చేయకుండానే నలుగురు కీలక ఆటగాళ్ళని కోల్పోయింది. ఇలాంటి సమయంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కి వచ్చాడు. సరిగ్గా ఈ సమయంలోనే ధోని కోసం షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ కి వచ్చాడు కిషన్. వచ్చి రావడంతోనే “షాట్ ఆడు, లేకుంటే నాకు దొరికిపోతావ్, అవుట్ అయిపోతావ్ దీని భాయ్” అంటూ కవ్వించాడు. అయితే.. ధోని మిస్టర్ కూల్ కదా? కిషన్ పిల్ల ఆటలను, మాటలను అస్సలు పట్టించుకోలేదు. తరువాత ఓవర్ లో ఓ మంచి షాట్ ఆది ధోని అవుట్ అయిపోయాడు. కానీ.., ఇక్కడ నుండే కిషన్ కి అసలు సినిమా మొదలయింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక దశలో కిషన్ బ్యాటింగ్ కి వచ్చాడు. అయితే.., కిషన్ లా ధోని ఎలాంటి స్లెడ్జింగ్ కి దిగలేదు. కిషన్ బ్యాటింగ్ కి రాగానే.. షార్ట్ ఎక్ట్రా కవర్ లో ఓ ఫీల్డర్ ని సెట్ చేశాడు ధోని. అంతే.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రైనాకి లడ్డు లాంటి క్యాచ్ ఇచ్చి, వెనుతిరిగాడు కిషన్. దీంతో.. లెజండ్స్ ముందు పిల్ల ఆటలు ఆడితే ఫలితం ఇలానే ఉంటుంది అంటూ… కిషన్ పై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు ధోని ఫ్యాన్స్. కానీ..,ట్విస్ట్ ఏమిటో తెలుసా? ధోని ఈ మొత్తం సంఘటనని అస్సలు పట్టించుకోలేదు.
మ్యాచ్ అయిపోయాక ఇదే కిషన్ కి, మరో ముంబై ఆటగాడు అంకుర్ రాయ్ కి సలహాలు ఇస్తూ గ్రౌండ్ లో కనిపించాడు ధోని. వీరి ముగ్గురి ఫొటోని క్యాప్చర్ చేసి, జార్ఖండ్ కనెక్షన్ అంటూ.. ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేయడం విశేషం. చూశారు కదా? ఇది మహేంద్ర సింగ్ ధోని గొప్పతనం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.
Ishan kishan 😂😂😂 pic.twitter.com/5Q51cYUsip
— msc media (@mscmedia2) September 20, 2021