కాలంతో సంబంధం లేకుండా దొరికే మంచి పానీయంలో ‘కల్లు’ ఒకటి. వివిధ రకాల కల్లు మనకు అందుబాటులో ఉంటోంది. కల్లు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా అతిగా తాగితే నష్టాలు తప్పవు.
“కల్లు” ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇది ఎక్కువగా వేసవికాలంలో దొరుకుతుంది. తాటి, ఈత, ఖర్జూరం వంటి చెట్ల నుంచి గీతకారులు కల్లును గీస్తారు. దీన్నే నీరా అనికూడా అంటారు. ఈ డ్రింక్ ను ఆల్కాహాల్ మాదిరిగానే జనం దీన్ని తాగుతారు. ఓ మోతాదుకు మించి దీన్ని తాగితే కిక్కు ఎక్కుతుంది. ఇది గ్రామాల్లో విరివిగా దొరుకుతుంది. ఎండాకాలంలో కల్లు తాగితే ఒంటికి చలువ చేస్తుంది. ఆరోగ్య పరంగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అతిగా తాగితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడాల్సి వస్తుంది.
చెట్ల నుండి అప్పుడే తీసిన దానిని నీరా అంటారు. క్రమక్రమంగా పులిసి అది కల్లు అవుతుంది. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెమట, శారీరక శ్రమ కారణంగా కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను మన శరీరంలోకి నింపుకోవడానికి దోహదపడతాయి. అందుకే ఎండాకాలంలో గ్రామాల్లో ఈ పానీయం ఎక్కువగా తాగుతుంటారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తాటికల్లు, ఈతకల్లు సేవించే వారు చాలా మంది ఉన్నారు. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హైదరాబాద్లో నీరా కేఫ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కల్లులో ఈస్ట్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, చక్కెర, ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, బి విటమిన్లు అన్ని ఉంటాయి. తాజా నీరాలో యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ B2 ఉంటుంది.
ఇది క్యాన్సర్ కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి శరీరానికి శక్తిని అందించుటలో తోడ్పడతాయి. అందుకు దీనిని ఇతర దేశాల్లో క్యాన్సర్ కు నివారణ ఔషధంగా కూడా వాడుతున్నారు. ఈ పానీయం దృష్టిని మెరుగుపరుచుకోవడంలో తాటి కల్లు మంచిది. ఆయుర్వేద చికిత్స తీసుకునేటప్పుడు వ్యక్తికి ఈత కల్లు సేవించడం జరుగుతుంది. దీని వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈతకల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది తాటికల్లు కంటే తీపిగా ఉంటుంది. పలుచగా ఉంటుంది. తాటి కల్లు అంత పుష్కలంగా ఈతకల్లు దొరకదు. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంపొందించుకునేందుకు కల్లు తాగుతారు. మితంగా తాగిన వారికి గుండె జబ్బు ఉన్న వారికి ముప్పు తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా కల్లు తాగడం ద్వారా రాళ్లు పడిపోతాయి.
కల్లు తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. అతిగా తాగితే శరీరం ప్రతికూల పరిస్థితులకు లోనవుతుంది. కాలేయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటుకు, నరాల బలహీనతకు దారితీస్తుంది. అనారోగ్య సమస్య ఉన్నప్పుడు సేవించడం మంచిది కాదు. అతిగా కల్లు తాగడం వలన కండరాల బలహీనత, రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే పెద్దలు అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు. మరి, కల్లు గురించిన మీ అనుభవాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.