మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా మనిషి అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. దిన చర్యలో భాగంగా కొందరు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తే, మరికొందరు 7,8 గంటలకు నిద్రలేస్తున్నారు. ఇలా ఆలస్యంగా నిద్రలేవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే? సాధారణంగా ప్రతీ మనిషి మధ్యాహ్నం తిన్నాక కొద్దిసేపు నిద్రపోయే అలవాటు ఉంటుంది.
అలా నిద్రపోతే మంచిదని, ఉత్తేజం పెరుగుతుందని తమకు తామే నిర్ధారణకు వస్తారు. అలా మధ్యాహ్నం నిద్రపోవడం కరెక్ట్ కాదని, ఇలా నిద్రపోతే లేనిపోని ఆనారోగ్య సమస్యలు వస్తాయని ప్రముఖ వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక మధ్యాహ్నం ఏ వయసుల వారు నిద్రపోవాలి? అసలు మధ్యాహ్నం నిద్ర అవసరమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల ప్రకారం.. మధ్యాహ్నం నిద్రపొవడం అంత మంచిది కాదనే తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Skin problem: మీ మెడ చుట్టూ నలుపు పేరుకుపోయిందా? ఈ చిట్కా పాటిస్తే 10 నిమిషాల్లో మాయం!
మరీ ముఖ్యంగా 20 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదట. అలా నిద్రపోతే అనారోగ్య సమస్యలతో పాటు రాత్రిపూట నిద్ర మీద ప్రభావం చూపుతుందని, దాని కారణంగా రాత్రిళ్లు నిద్రపట్టకుండా నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇక వీటన్నిటికి ఒకే చిట్కా.. అసలు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉంటే రాత్రిపూట ప్రశాతంగా నిద్రపోవచ్చని, మరే ఇతర అనారోగ్య సమస్యలు రావంటూ ప్రముఖ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.