మానవ మనుగడకు ఆధారం నీరు. శరీరంలో ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలను సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రపోషిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగుతున్న అవసరాలు, కలుషిత పదార్థాల నేపథ్యంలో నీరు కూడా శుద్ధి చేసుకొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. ఏదైనా అతిగా వినియోగిస్తే అనర్థమే అన్నట్లుగా.. ఈ నీరు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందట.
భూమి మీద జీవించే ప్రాణులకు ఆధారం నీరు. నీరు లేనిదే మనిషి మనుగడ సాధించడం కష్టం. మనిషి ఆరోగ్యంగా జీవించడానికి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. మానవ శరీరములో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే ప్రాధాన్యత ఉంది. మానవ శరీరంలో ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలను సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రపోషిస్తుంది. నీటిలో క్లోరిన్, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. అయితే నేటి జీవన విధానంలో ప్రతిదీ కలుషితమౌతోంది. ఆ తోవలో నీరు ఉంది. అందుకే ఆరోగ్యం కోసం.. శుద్ది చేయబడిన నీటి కోసం గతంలో వాటర్ ఫిల్టర్లు వినియోగించేవారు.
హడావుడి లైఫ్, పెరుగుతున్న అవసరాలు.. ఆధునిక వస్తువుల రూపంలో ఇంటికి వస్తున్నాయి. అలా వచ్చింది ఆర్ఓ (RO)వాటర్ ప్యూరిఫైయర్. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మాసిస్. ఇది కలుషిత నీటిని శుద్ధి చేసే పరికరం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దీని ద్వారా పరిశుభ్రమైన నీటిని తాగుతున్నామన్న భ్రమలో బతికేస్తున్నాం. అయితే దీని వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీటిలో దేహానికి అందించే సహజ ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అయితే నీటిని శుద్ధి చేసే క్రమంలో ఆర్ఓ వాటిని కూడా తొలగించేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ నీరు ఎక్కువ తాగడం వల్ల బి12 లోపానికి దారి తీస్తుందని తేలింది. అంటే ఇది లోపిస్తే రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినే అవకాశాలున్నాయి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.