Leptospirosis: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ వంటి నగరాలు ఇబ్బందుల్లో పడిపోతాయి. చిన్న వాన పడినా రోడ్లపై నీళ్లు నిలుస్తుంటాయి. ఇక, డ్రైనేజీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వాన నీటితో నిండి, పైకి పోర్లిపోతూ ఉంటాయి. వర్షపు నీటితో కలిసి రోడ్లపై పారుతూ ఉంటాయి. ఇక, జనం రోడ్లపై నడవాల్సి వచ్చిన ప్రతీసారి ఆ మురికి నీళ్లపై వెళ్లాల్సి ఉంటుంది. అలా మురికి నీళ్లలో నడవటం ఇష్టం లేకపోయినా తప్పక చేయాల్సింది. అయితే, అదే పనిగా అనవసరంగా వర్షపు నీళ్లలో తిరగటం మంచిది కాదు. వర్షపు నీళ్లలో నడవటం కారణంగా లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి కారణంగా ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది.
ఇంతకీ ఏంటీ లెప్టోస్పైరోసిస్?.. ఎలా సోకుతుంది?..
లెప్టోస్పైరా అనేది ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా.. ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించినపుడు లెప్టోస్పైరోసిస్ సోకుతుంది. జంతువుల మూత్రం వాన నీటితో కలిసి.. ఆ నీటిపై మనం తిరిగినపుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాళ్లకు గాయాలైన వారికి ఈ వ్యాధి తొందరగా సోకే అవకాశం ఉంది. లెప్టోస్పైరోసిస్ సోకిన వారికి ఎక్కువ జ్వరం, తలనొప్పి, రక్త స్రావం, కండరాల నొప్పులు, కళ్లు ఎర్రగా మారటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఒక వేళ లెప్టోస్పైరోసిస్ సోకినపుడు వైద్యం చేయించుకోకుండా ఉంటే మటుకు కిడ్నీలు, కాలేయం దెబ్బతింటాయి. మరణం కూడా సంభవించే అవకాశం ఉంది.
వర్షాకాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు :
ఇవి కూడా చదవండి : Gay Marriage: ఏళ్లుగా సహజీవనం.. ప్రియుడిని పెళ్లాడిన భారతీయ ‘గే’ యువరాజు!