శృంగారం విషయంలో చేయకూడని సందర్భాలను కూడా వైద్యులు, పెద్దలు ప్రత్యేకంగా సూచిస్తున్నారు. సెక్స్ అనేది ఇద్దరూ అన్యోన్యంగా, హాయిగా ఎంజాయ్ చేయాల్సిన ప్రక్రియ. అయితే, కొన్ని సందర్భాల్లో.. అంటే పరధ్యానంగా ఉన్నప్పుడు, మూడ్ బాగోలేనప్పుడు శృంగారం కోసం భాగస్వామిని బలవంతం చేయరాదని చెబుతున్నారు. ఇద్దరి మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి భాగస్వామిని సెక్స్ కోసం ఇబ్బంది పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆల్కహాల్ సేవించిన సందర్భంలో సెక్స్ చేయకపోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మద్యం మత్తులో నియంత్రణ కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రవర్తన మారుతుందని, దీని వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల సెక్స్‌లో పర్ఫార్మెన్స్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
పెళ్లి కాని జంటల మధ్య సెక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అసురక్షిత లైంగిక కార్యకలాపాలు మీకు చెడు చేస్తాయంటున్నారు. కండోమ్ లేకుండా శృంగారం మంచిది కాదంటున్నారు. దీని వల్ల మహిళల్లో ఎస్‌టీఐ, గర్భం వచ్చే సూచనలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. పిల్లలు త్వరగా వద్దనుకొనే వారు కండోమ్ వాడటం ముఖ్యమని చెబుతున్నారు.
కండోమ్ వాడటం వల్ల అన్ని విధాలా ఉపయోగకరం. గర్భం దాల్చకపోవడం, సుఖవ్యాధులు ప్రబలకుండా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. కండోమ్ వాడకం కాస్త ఇబ్బందికరంగా ఉన్నాసరే.. ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. బయటకు వెళ్లి వచ్చినప్పుడు.. లేదా కాస్త గ్యాప్ తర్వాత కలయిక జరుగుతున్న సందర్భాల్లో ఆత్రంతో కూడా శృంగారం చేయరాదని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఇద్దరికీ మంచిది కాదని హితవు పలుకుతున్నారు. కాస్త నెమ్మదిగా ఆస్వాదిస్తూ చేయాలని సూచిస్తున్నారు. శృంగారం అనేది వేగంగా, ఆత్రపడుతూ చేయాల్సిన పని కాదని, ఇరువురూ పరస్పరం అవగాహనతో ప్రశాంత వాతావరణంలో చేసుకోవాల్సిన మంచి కార్యమని పెద్దలు చెబుతున్నారు. ఇది ఎలాంటి సందర్భాల్లోనైనా గుర్తుంచుకోవాల్సిన అంశమని సూచిస్తున్నారు.