వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం శీతల పానియాల వెంటపడుతుంటారు. వేసవి కాలం వచ్చిందంటే మరకు ఎక్కువగా కనిపించేవి పుచ్చకాయలు. ఇవి ఆరోగ్యమే కాదు.. మంచి శక్తిని ఉత్తేజాన్ని ఇస్తాయి. పుచ్చకాయను రక రకాలుగా తీసుకోవొచ్చు. అందుకే వేసవి కాలంలో వీటికి బాగా గిరాకీ ఉంటుంది. అయితే పుచ్చకాలు కొనే ముందు మనం కొన్ని గమనించాలి. అందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి పుచ్చకాలతో పాటు ఆరోగ్యం మీ సొంతం.
సాధారణంగా పుచ్చయాలు కొనే సమయంలో పెద్దగా ఉంటే ఎర్రగా ఉంటాయి.. తీపిగా ఉంటాయని భావిస్తుంటారు. అందులో ఎక్కువ గింజలు ఉండవని గుజ్జు ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. అయితే అది తప్పు.. కాయ పరిమాణం కాదు.. బరువు ఉన్నదా లేదా అని చూసుకోవాలి. కాయ ఎక్కువ బరువు ఉంటే అందులో నీటి పరిమాణం, గుజ్జు ఎక్కువగా ఉంటుందని అర్థం. అందుకే సాధ్యమైనంత వరకు సైజ్ కన్నా ఎక్కువ బరువు ఉన్న కాయలు ఎంచుకోవాలి.
పుచ్చకాయని చాలా మంది కొట్టి చూస్తుంటారు.. అలా కొట్టినపుడు టక్ అని సౌండ్ వస్తే అది పండినట్టు.. ఒకవేళ శబ్దం రాకుండా ఉంటే అది పూర్తి స్థాయిలో పండనట్లు అని అర్థం. ఎందుకంటే పండని కాయలు శబ్దం ఎక్కువగా బయటకు రాదు. ఎక్కువ శాంతం పుచ్చకాయలు షాపు వాళ్లు తొడిమ తీసి అమ్ముతుంటారు. తొడిమతో ఉన్న పండ్లు చూసి మనం పండిదా లేదా అని చెప్పవొచ్చు. తొడిమ ఎండిపోయి ఉంటే కాయ బాగా పండినట్లు.. పచ్చిగా గ్రీన్ కలర్ లో ఉంటే అది సరిగా పండలేదని అర్థం.
సాధారణంగా కొంత మంది పుచ్చకాయను ముక్కుదగ్గర పెట్టుకొని వాసన చూస్తుంటారు.. తియ్యని వాసన వస్తే అది మంచిగా పండినట్టు.. అలా అని మరీ తియ్యని వాసన వచ్చినా కూడా మంచిది కాదు.. ఎందుకంటే కొన్ని కుళ్లిపోయినవి కూడా ఉండొచ్చు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కాయలపై రక రకాల గీతలు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఇలాంటి పుచ్చకాయలు బాగా రుచిగా ఉంటాయి. ఈ విధంగా పుచ్చకాయ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని మంచి పండ్లను తిని ఆరోగ్యంగా ఉండండి.