ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య మోకాళ్ల నొప్పులు. ఇంటి దగ్గర ఉండే సాధారణ గృహిణుల నుంచి ఆఫీస్ వర్క్ చేసే పురుషుల వరకు అందరూ ఎదుర్కొంటున్న సర్వ సాధారణ సమస్య ఇది. ఈ సమస్యను మనం ఇంట్లో తరచుగా ఉపయోగించే ఒక పదార్ధంతో పోగొట్టుకోవచ్చు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. కర్పూరం.. ఔనండీ.. నిజంగా కర్పూరంతో మోకాళ్ల నొప్పుల్ని నయం చేసుకోవచ్చు. నిజానికి కర్పూరం అనేది మనమంతా సాధారణంగా పూజా సామాగ్రిగా మాత్రమే ఉపయోగిస్తాం. కానీ, మోకాళ్ల నొప్పుల్ని తగ్గించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మార్కెట్ లో రెండు రకాల కర్పూరాలు దొరుకుతాయి. ఒకటి హారతి కర్పూరం, రెండోది పచ్చ కర్పూరం.
పచ్చ కర్పూరం అనేది సహజంగా చెట్ల నుంచి వచ్చేది. దీనిని ఆహార పదార్ధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మన శరీరం లోపలి అవసరాలకు పచ్చ కర్పూరాన్నే వాడాలి. హారతి కర్పూరాన్ని శరీరం పైన మాత్రమే వాడాలి. ఎప్పుడూ లోపలి అవసరాలకు వాడకూడదు. గాయాలైనా, రక్తం స్రవిస్తూ ఉన్నా, తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఈ సమస్యలన్నిటికీ కర్పూరం అనేది ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రమాదంలో దెబ్బలు తగిలి, రక్తం కారుతూ ఉన్నప్పుడు కర్పూరాన్ని ప్రథమ చికిత్స కోసం వాడుకోవచ్చు. కాస్త కర్పూరాన్ని తీసుకుని, పేరిన నెయ్యిలో వేసి, బాగా నూరండి. అపుడు అది ఒక పేస్ట్ లా తయారవుతుంది. ఆ పేస్ట్ ను గాయమైన చోట పూయండి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. ఆ గాయం త్వరగా మానుతుంది.
అదే విధంగా చిన్న పిల్లల్లో కడుపు నొప్పి,విరేచనాలు తగ్గించడానికి కర్పూరం ఉపయోగపడుతుంది. కర్పూరం, నేతిలో పొంగించిన ఇంగువ, జీలకర్ర, జాజికాయ.. ఈ నాలుగు పదార్ధాలను తీసుకోండి. ఒక్కొక్కటి పొడిగా చేసి, ఈ నాలుగు పొడులను సమంగా కలిపి, నిల్వ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా చిన్నపిల్లలకైతే చనుబాలతో ఇవ్వాలి. కొంచెం పెద్ద పిల్లలకైతే తేనెతో ఇవ్వొచ్చు. ఇలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. దీనివల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అజీర్తి లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
అలాగే, కొంతమందికి అరచేతులు, అరికాళ్లలో పగుళ్లు వస్తూ ఉంటాయి. వీటిని నివారించడానికి కూడా కర్పూరం ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి. దానికి కొంచెం పసుపుని, కొంచెం కర్పూరాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని పగుళ్లు ఉన్నచోట పూయండి. ఇలా క్రమం తప్పకుండా పదిరోజులు చేయడం వల్ల చాలా ఫలితం ఉంటుంది. ఇక, కొంతమందికి శరీరంలో కొవ్వు తయారై, దీనివల్ల చాలా రకాల శారీరక సమస్యలు వస్తాయి. వాటి నుంచి ఉపశమనం పొందడానికి,అలాగే, జలుబు, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు లాంటివి ఉన్నప్పుడు, వాటి నివారణకు కర్పూరంతో ఒక ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ ఔషధం గురించి, ఇంకా మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.