Cancer Treatment Cures AIDS: గత కొన్ని దశాబ్ధాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి రోగం ఎయిడ్స్. ఈ వ్యాధి ఇప్పటి వరకు కొన్ని లక్షల మందిని బలితీసుకుంది. మరికొన్ని లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుంచి బయటపడటం నిజానికి అసాధ్యం. ఒక్కసారి సోకితే ప్రాణాలు పోగొట్టుకోవటం తప్పితే వేరే దారి ఉండదు. కానీ, ఓ నలుగురి విషయంలో మాత్రం ఈ వ్యాధి తల వంచింది. ఎయిడ్స్ సోకిన ఆ నలుగురు ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.
వారు క్యాన్సర్ కోసం చికిత్స చేయించుకోగా ఎయిడ్స్ వ్యాధి కూడా నయమైంది. ఈ మూడు సంఘటనలు గతంలో చోటుచేసుకోగా.. ఓ సంఘటన తాజాగా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 66 ఏళ్ల ఓ వ్యక్తికి 1988లో ఎయిడ్స్ వ్యాధి నిర్థారణ అయింది. ఇక అప్పటినుంచి అతడు యాంటీ వైరల్ చికిత్స తీసుకుంటున్నాడు. కొన్నేళ్ల తర్వాత అతడికి క్యాన్సర్ కూడా వచ్చింది. దీంతో అమెరికాలోని సిటీ ఆఫ్ హోప్‌లోని క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో చికిత్స చేయించుకుంటున్నాడు. అక్కడ కొన్ని నెలల పాటు కీమోథెరపీ చేయించున్నాడు.
2019లో ఓ అరుదైన జన్యు పరివర్తన కలిగిఉన్న ఓ డోనర్‌నుంచి రక్త మూల కణాల్ని సేకరించి రోగికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. చికిత్స జరిగిన కొద్దిరోజులకే క్యాన్సర్ వ్యాధితో పాటు ఎయిడ్స్ కూడా నయమైంది. దీంతో పేషంట్‌తో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకుని, ఎయిడ్స్ వ్యాధిని నయం చేసుకున్న వారిలో ఈ వృద్ధుడు నాలుగో వాడని డాక్టర్లు పేర్కొన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Physiotattva: ఎన్నో ఏళ్లుగా మోకాళ్లు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా? ఇదిగో పరిష్కారం!