పొట్ట పెరిగిపోతోంది. ఏమి చేయాలో అర్ధం కావడం లేదు.. మనం తరుచుగా వినే మాటలు ఇవి. వయసు పెరిగే కొద్దీ పొట్ట పెరగడం కూడా కామన్ అనుకునే స్థితికి పరిస్థితి వచ్చేసింది. నిజానికి వయసుకి, పొట్ట పెరుగుదలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. మన జీవితంలో తెలియక చేసే ఓ 8 తప్పులు పొట్ట రావడానికి కారణం అవుతాయని మీకు తెలుసా? ఇప్పుడు ఆ 8 తప్పులు ఏంటివో తెలుసుకుందాం.
1) చాలా మందికి జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అలాంటి వారు ఎట్టి పరిస్థితిల్లో ఎక్కువ ఆహారాన్ని ఒకేసారి తీసుకోకూడదు. వీరు ముందుగా జీర్ణవ్యవస్థని మెరుగు పరుచుకోవాలి. అప్పటి వరకు వరుస విరామాల్లో కొంత కొంత ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
2. వయస్సుతో పాటు.. శరీరంలో హార్మోన్ల మార్పులు అనేవి చాలా సాధారణంగా జరుగుతాయి. ఇలాంటి స్థితిలో మనం బరువు పెరుగడం చాలా కామన్. ఇలాంటి సమయంలోనే నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఇలా ఏర్పడిన పొట్ట కరగాలంటే చాలా కష్టం. ఇందుకే ఒక వయసు వచ్చాక తప్పనిసరిగా వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. కనీసం ఒక అరగంట సేపు నడిచినా సరిపోద్ది.
3. భోజనం చేసే సమయంలో ఎక్కువ నీరు తీసుకుంటున్నారా? ఈ అలవాటు కూడా మీ పొట్ట పెరుగుదలకు ఒక కారణం అని తెలుసుకోండి. భోజనం చేసే సమయంలో ఎక్కువ నీరు తాగడం మంచిదికాదు. అటువంటి పరిస్థితిలో జీర్ణక్రియ సరిగ్గా జరగదు. కడుపులో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. భోజనానికి ఒక గంట ముందు, గంట తర్వాత మాత్రమే నీరు తాగాలి.
4. ఇక వేళకి భోజనం చేయకపోయినా, అసలు ఆహారమే తీసుకోకపోయినా మీ శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి. ఇలాంటి సందర్భాలలో పొట్ట పెరగడం అనేది చాలా చిన్న సమస్య అవుద్ది. మెయిన్ గా గ్యాస్ ఏర్పడి జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుంది. కాబట్టి ఆహారాన్ని స్కిప్ చేయకుండా, వేళకి తినండి.
5. కొన్నిసార్లు ఊబకాయం కూడా జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది. దానిని నియంత్రించలేమని కాదు. దీన్ని నిర్వహించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ చేయడం చాలా ముఖ్యం.
6. ఒత్తిడి మీ బరువును పెంచుతుందని మీకు తెలుసా? కానీ.., ఈ బరువు లోపలి నుంచి మిమ్మల్ని చాలా బలహీనపరుస్తుంది. ఇది ఆటోమేటిక్ గా పొట్ట పెరుగుదలకు కారణం అవుతుంది. కాబట్టి.., ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా అలవాటు చేసుకోండి.
7. మనలో కూర్చొని పనిచేసే చాలా మందికి పొట్ట ఉంటుంది. దీనికి ప్రధాన కారణం శరీరానికి శారీరక శ్రమ లేకపోవడం. సో.., పొట్ట రాకూడదు అనుకుంటే ఈరోజే వ్యాయామాలు చేయడం మొదలు పెట్టండి.
8. ఇక ఇతర అనారోగ్య కారణాల చేత మందులు వాడే వారు తక్కువ సమయంలో లావు వచ్చేస్తారు. అలాగే.., వీరిలో పొట్ట పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పొట్ట పెరుగుదలని నియంత్రించుకోవచ్చు.