దేశానికి స్వాతంత్ర్యం వచ్చి75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే జాతీయ జెండాను ఎగరవేసే క్రమంలో చాలా మంది రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు కనీస నియమ నిబంధనలు తెలుసుకోకుండా తరుచు పొరపాట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో అనేక మంది రాజకీయ నాయకులు సైతం కనీస నియమాలు పాటించకుండా జాతీయ జెండాను ఎగరేసి అబాసు పాలయ్యారు. అయితే ఆగస్టు 15న కానీ జనవరి 26న కానీ జాతీయ జెండా ఎగరవేసే క్రమంలో కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు.
ఇవేవి తెలియకుండా ఇష్టమొచ్చిన రీతిలో జాతీయ జెండాను ఎగరేస్తూ జాతీయ జెండాకు ఉన్న విలువను తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా జాతీయ జెండాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2002లో కొన్ని నియమాలు గెజిట్‌లో పొందుపరిచారు. అసలు ఆ గెటిట్ లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలు, నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ V రూల్ ప్రకారం.. స్వాతంత్ర్యం దినోత్సవం రోజు, గణతంత్ర దినోత్సవం రోజు ఫ్లాగులో పూలు పెట్టి జాతీయ జెండా ఎగరేయాలి.