అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారత దేశాలకే పరిమితమైన ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడిడు హోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎల్లప్పుడూ అన్నకు అండగా ఉంటానని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు.
సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది.
ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్టు 11న రానుంది. ఈ క్రమంలో అన్నదమ్ముల మీద మీ ప్రేమను తెలియజేసే ఎన్నో రాఖీల వివరాలు మీకందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చినవి సొంతం చేసుకొని అనందంగా పండుగ జరుపుకోండి.