ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది పండుగ అంటే తెలుగువారి పండగ అని చెప్పక తప్పదేమో. పాశ్చత్య దేశాల్లో జవవరి 1ని అంగరంగా వైభవంగా జరుపుకునే ఈ పండుగను తెలుగు వాళ్లు ఉగాది పేరుతో పండుగను ఆనందంగా జరుపుకుంటుంటారు. ఈ పండుగను ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుచ్చోది ఉగాది పచ్చడి. అసలు దీనిని ఎలా తయారు చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది పచ్చడి తయారీ విధానం:
ఉగాది పచ్చడి తయారీకి ముందు.. కారం, పులుపుకు మామిడి కాయ, చింతపండు, బెల్లంతో పాటు వేదురు వేపపువ్వు, పచ్చిమిర్చి దగ్గర తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వేప పువ్వును వలిచి ఓ గిన్నెలో వేసుకోవాలి. దాని తర్వాత సరిపడ బెల్లం, వలిచి పెట్టుకున్న వేప పూతను గిన్నెలో వేయాలి. ఇక తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. అంతేకాకుండా పచ్చి కారం వేసుకునే అలవాటు ఉంటే చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అనంతరం మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా చిక్కటి చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి. ఇక అవసరారాన్ని బట్టి పుట్నాలు లేదా అరటిపండు ముక్కలు కట్ చేసి అందులో వేసుకుని మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్నఆ పచ్చడిని ఓ మట్టి పాత్రలో వేసుకుని ఇదే పచ్చడిని ముందుగా ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని ఆతర్వాత మనం తాగాలి.