ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడతాకాజా, హైదరాబాద్ బిర్యానీ… ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఫేమస్. అలా చెప్పుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాల వరకే తీసుకున్నా సరే లిస్ట్ చాలా పెద్దది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో బిర్యానీ చేరినట్లు కనిపిస్తుంది. అదే ‘చంపారన్ బిర్యానీ’. పేరేంటి కొత్తగా ఉందని ఆలోచిస్తున్నారా.. జస్ట్ వెయిట్ ఇది మనది కాదు. బిహార్ రాష్ట్రంలోని చంపారన్ ప్రాంతంలో చికెన్ ని చాలా డిఫరెంట్ గా కుక్ చేస్తారు. ఆ ప్రొసెస్ లోనే బిర్యానీ కూడా చేస్తారు. ఇప్పుడు దాన్నే హైదరాబాద్ కి తీసుకొచ్చారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశంలో ఎక్కడ దొరికే ఫుడ్ ఐటమ్ అయినా సరే హైదరాబాద్ లో దొరుకుతుంది. అది భాగ్యనగరం స్పెషాలిటీ. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో వెరైటీ ఫుడ్ వచ్చి చేరినట్లు కనిపిస్తుంది. అదే చంపారన్ బిర్యానీ. ఇది కూకట్ పల్లిలో కొత్తగా పెట్టిన అంబా భవానీ రెస్టారెంట్ లో దొరుకుతుంది. పూర్తిగా బిహార్ వంటకమైన చంపారన్ చికెన్ ని.. అప్పటికప్పుడే మట్టి కుండలో వండి వడ్డిస్తారు. దీని రుచి కూడా అందుకు తగ్గట్లే ఉందని హోటల్ కి వచ్చి లేదంటే పార్సిల్ తీసుకెళ్లి తిన్నవాళ్లు చెబుతున్నారు. మరి ఇంకెందుకు లేటు.. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి.