చదువు పూర్తి అయ్యాక ఏమి చేయాలి? చదివిన చదువుకి తగ్గ ఉద్యోగాన్ని ఎలా సాధించాలి? చాలా మంది విద్యార్ధులకు అర్ధం కాని ప్రశ్నలు ఇవి. ఈ విషయంలో సరైన గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే సరైన వేదిక బిజినెస్ స్కూల్ ఎక్స్ పో-2022.
ఈరోజుల్లో గ్రాడ్యుయేషన్ తరువాత బిజినెస్ స్కూల్స్ లో చేరి తమ కెరీర్ లను చక్కదిద్దుకుంటున్న స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువ అయ్యింది. గ్రాడ్యుయేషన్ తరువాత తమ తమ ఎడ్యూకేషనల్ బ్యాగ్రౌండ్ కి తగ్గట్టు ఏ PG చదవాలో నిర్ణయించుకుని, ఈ బిజినెస్ స్కూల్స్ లో చేరితే.. మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వొచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందించాలన్న ఆలోచనతో.. ఈ నెల 13న హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ లో బిజినెస్ స్కూల్ ఎక్స్ పో-2022 కండక్ట్ చేయబోతున్నారు
ఈ ఎక్స్ పోకి మొత్తం 15 కి పైగా.. బెస్ట్ బిజినెస్ స్కూల్స్ కు చెందిన ప్రొఫెషనల్స్ హాజరవబోతున్నారు. విద్యార్థులు బిజినెస్ స్కూల్ ఎక్స్ పో-2022 వేదికను ఉపయోగించుకుని.., ఆ ప్రొఫెషనల్స్ తో స్వయంగా మాట్లాడి.. తమకి నచ్చిన బెస్ట్ బిజినెస్ స్కూల్ లో జాయిన్ కావచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ కింద వీడియోను చూడండి.