హిందువుల సంప్రదాయం ప్రకారం దేవుడిని పూజించే విధానంలో దీపారాధన అనేది చాలా కీలకమైనది. అయితే కొందరు నిత్యం పూజలు చేస్తుంటారు. మరి కొందరు నిత్య పూజా విధానాన్ని పాటించరు. కానీ దీపం అనేది పూజా మందిరంలో ప్రతి దినము వెలిగించడం వలన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇంట్లోని వ్యక్తుల మనసులు ఎంత గందర గోళంగా ఉన్నప్పటికీ దీపాన్ని చూడగానే కాస్త మనశ్శాంతి దొరుకుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. దీపం అనగా జ్యోతి. జ్యోతి అంటే దైవం.దైవము సాక్షాత్తు దీపం రూపంలో మన ఇంట్లో కొలువై ఉంటారని పండితులు చెబుతున్న మాట. అందుకే నిత్యము దీపారాధన చేయుట మంచిది.
దీపారాధన చేయాలంటే తలస్నానం చేయాలని చాలామంది భావిస్తారు. ఇదే అనుమానంతో రోజూ దీపారాధన చేయడం మానేస్తున్నారు. వివాహం అయిన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజూ తలస్నానం చేయవలసిన పనిలేదు. స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరిస్తే నిత్యా దీపారాధన రోజూ చేసుకునే పూజ చేయ వచ్చు. ఆడవాళ్లకు పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది. కుంకుమ ధరించ డం వల్ల గంగమ్మ తల్లి ని అక్కడ నిలుపుకొని పూజించినట్టు. అందువల్ల ఆడవాళ్లకు రోజూ తలస్నానం అవసరం లేదు.
ఆడవారు బుధ, శనివారం, తలస్నానం చేయడం మంచిది, శుక్రవారం వ్రతాలు ఉన్నపుడు శుక్రవారం చేయవచ్చు.జట్టు చివర్లో ముడి వేసుకుని తలంటి పోసుకోవాలి. ఇలా చేస్తే శుభకరంగా ఉంటుంది. ప్రతిరోజు తలస్నానం చేసేవారు, వారానికి రెండు సార్లు, నెలలో నాలుగు సార్లు చేసేవారు చిటెకెడు పసుపు, కర్పూరం పొడిచేసుకొని తలస్నానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలుగుతాయి.
మరిన్ని వివరాలకోసం ఈ వీడియో చుడండి: