తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ మొదలైంది. దీంతో పట్టణాల్లో, పల్లెల్లో పండగ వాతావరణం జోరందుకుంది. ఇటీవల గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఈ శోభ తెలంగాణ అంతటికీ వెళ్లనుంది. ఇక తాజాగా సికింద్రాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఇక ఈ వేడుకల్లో భక్తులకు స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. ప్రతి బోనాలకు ఇక్కడ భవిష్యవాణిని వినిపించటం జరుగుతోంది.
ఇక దీని కోసం తెలంగాణ వ్యాప్తంగా భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తాజాగా సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. ఇక ఇందులో ఆమె చేప్పిన అంశాల్లో ఏముందంటే…రైతులు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారని తెలిపింది. దీంతో పాటు ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, కరోనాతో ఇబ్బందులు వచ్చినా నన్ను కొలవటం మరిచిపోలేదని అన్నారు. ఇక మీ కష్ట నష్టాల్లో తోడుగా ఉంటానని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా చుసుకుంటానని, ఇప్పటికీ కూడా నాకు పూజలు చేయటం మరిచిపోలేనందుకు నాకు చాలా సంతోషంగా ఉందని స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపింది.