అక్టోబర్ 25న సూర్యగ్రహణం.. ఈ ఏడాది ఇది రెండో సూర్యగ్రహణం కావడమే కాకుండా.. ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం. అంతేకాకుండా ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కాదు.. ఈ సంవత్సరంలో చివరిది. ఈ సూర్య గ్రహణం భారత్ సహా ఐరోపా, ఈశాన్య ఆఫ్రికన్ దేశాలు, పశ్చిమాసియాలో సంభవించనుంది. భారతదేశంలో మాత్రం కొన్ని చోట్ల మాత్రమే ఇది కనిపించే అవకాశం ఉంది. జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం ఏదైనా గానీ.. అవి కొందరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటే.. కొందరికి మాత్రం మధ్యస్త ఫలితాలు, ఇంకొందరికి వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అయితే ఏ రాశి వారికి మంచి ఫలితాలను, ఏ రాశుల వారికి మధ్యస్త, అశుభ ఫలితాలను అందిస్తుందో చూద్దాం.
ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని తులారాశి వారు చూడకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది స్వాతి నక్షత్రంలో సంభవించింది. ఈ పాక్షిక సూర్య గ్రహణం సింహరాశి, వృషభం, మకరం, ధనుస్సు రాశుల వారికి శుభఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. అలాగే కన్యా రాశి, మిథునం, మేషరాశి, కుంభ రాశుల వారికి మధ్యస్త ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. కర్కాటకం, తుల, మీనం, వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఏ రాశుల వారికి శుభఫలితాలు ఉన్నాయో పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ వీడియో వీక్షించడం.