Swetharka Ganapathi: హిందూ దేవుళ్లలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్లలో అందరికంటే ముందు పూజలు అందుకునే ఏకైక దేవుడు వినాయకుడు. ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు చాలా మంది వినాయక పూజ చేస్తుంటారు. ఎందుకంటే చేయబోయే పనికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని. కష్టాలు తొలగించే వాడు కాబట్టే ఆయనను విఘ్నేశ్వరుడు అని పిలుస్తుంటారు. కష్టాల్లో ఉన్నపుడు వినాయకుడి పూజ చేస్తే గట్టేక్కుతామని హిందువుల నమ్మకం. ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టుతో తయారు చేసిన శ్వేతార్క గణపతిని పూజిస్తే సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని ప్రతీతి. తెల్ల జిల్లేడు వేర్ల మీద స్వయంగా వినాయకుడు కొలువై ఉంటాడు.
అందుకే తెల్ల జిల్లేడును దైవంలా భావించి ఇంట్లో నాటుకుని ప్రతిరోజూ పూజలు చేస్తుంటారు. అలాంటి తెల్ల జిల్లేడుతో తయారు చేసిన వినాయకుడి ప్రతిమను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయని, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకోవాలనుకునే వారు తప్పకుండా కొన్ని నియమాల్ని తప్పక పాటించాలి. పండితుల సలహా మేరకు మూహూర్తం చూసుకుని ఇంట్లో ప్రతిష్టించుకోవాలి. పూజలో కూడా శుభ్రంగా కడిగిన ఎర్రని వస్త్రంపై ఉంచి ధూపదీప నైవేధ్యాలతో పూజించాలి. మరి, తెల్ల జిల్లేడుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నేడు సీతారాముల కల్యాణం… ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.