ప్రత్యేకమైన రోజుల్లో దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాల పరిశుభ్రతతో పాటు విగ్రహాలను పరిశుద్దం చేస్తారు. దీని కోసం వాటిని బయటకు తీసుకు వచ్చి పుష్కరిణీలో వేద మంత్రాల నడుమ స్నాన జపాలు చేయిస్తారు. ఆ నీటితో వాటికి అభిషేకం చేస్తారు.
గుడిలో ఉండే దేవతా విగ్రహాలను పూజాధి కార్యక్రమాలు నిర్వహించేందుకు పండితులు ముందుగా వాటిని పరిశుభ్రం చేస్తారు. వాటిని అందంగా అలకంరించి, భక్తుల సందర్శనార్ధానికి అనుమతినిస్తున్నారు. ఇవన్నీ చాలా నియమ, నిబంధనలతో పండితులు నిర్వహిస్తారు. ఆ తర్వాత దేవతా విగ్రహాలకు చేయాల్సిన ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఇక ప్రత్యేకమైన రోజుల్లో అయితే కూడా వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాల పరిశుభ్రతతో పాటు విగ్రహాలను పరిశుద్దం చేస్తారు. దీని కోసం వాటిని బయటకు తీసుకు వచ్చి పుష్కరిణీలో వేద మంత్రాల నడుమ స్నాన జపాలు చేయిస్తారు. ఆ నీటితో వాటికి అభిషేకం చేస్తారు. ఆ నీటినే పూజలకు వినియోగిస్తారు. ఆ సమయంలో ఎవ్వరినీ నదిలోకి లేదా కొలనులోకి రానివ్వరు. కానీ నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయ ఈవో మాత్రం అపచారానికి ఒడిగట్టాడు. విగ్రహా మూర్తులు జలకాలాడుతున్న సమయంలో్ నదిలోకి దిగి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. అసలేమైందంటే..?
దక్షిణ కాశీగా నీలకంఠేశ్వర ఆలయాన్ని కొలుస్తారు భక్తులు. అటువంటి గుడిలో అపచారానికి ఒడిగట్టారు ఈవో. అన్ని ధార్మిక కార్యక్రమాలు సజావుగా జరిపించవలసిన ఈవోనే అపచారానికి పాల్పడ్డారు. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈవో వేణు స్వామి జలకాలాడారు. ఇటీవల నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి అనంతరం స్వామివారి పుష్కరిణిలో విగ్రహాలకు అభిషేకం చేస్తున్న క్రమంలో ఈవో ఈత కొట్టారు. అర్చకులు పుష్కరిణిలో ఈత కొట్టకూడదని చెప్పినప్పటికీ.. వేణు స్వామి పట్టించుకోకుండా జలకాలాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. వేణు మొత్తం నాలుగు ఆలయాలకు ఇంఛార్జ్ ఈవోగా ఉన్నారు.
అలాంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న అధికారి ఇలా పుష్కరణిలో దేవునికి అభిషేకం చేసే సమయంలో ఈత కొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ ఈవోగా ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ.. స్వామి వారికి అభిషేకం జరుగుతుండగా.. ఈత కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈత కొడుతూ నీటిని అపవిత్రం చేశారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నీలకంఠేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది.. ఆలయం నీలకంఠేశ్వర రూపంలో శివునికి అంకితం చేశారు. ఈ ఆలయం 15వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం నిర్మించబడింది.. ఈ ప్రాంతంలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణిస్తారు స్థానికులు. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.. ఈ ఆలయం 2000లో పునర్నిర్మాణం చేశారు.