తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పండగ రోజు పచ్చడి, భక్ష్యాలు మాత్రమే కాక పంచాంగ శ్రవణానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.. ఏ రాశి వారికి కలిసి వస్తుంది అంటే..
తెలుగు నూతన సంవతర్సం ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం మాత్రం మనకు ఉగాది నాడే నూతన తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఇక ఈ ఏడాది మార్చి 21వ తేదీ, మంగళవారం నాడు “శుభకృత్” నామ సంవత్సరం ముగిసి.. మార్చి 22వ తేదీ బుధవారం కొత్త ఏడాది “శ్రీ శోభకృత్” నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఈ తెలుగు ఏడాది.. 2021, ఏప్రిల్ 8న ముగుస్తుంది. ఇక ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పంచాగ శ్రవణం చేస్తారు. ఈ సందర్భంగా ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
కొత్త ఏడాదిలో తమకు ఎలా ఉండబోతుంది.. కలిసి వచ్చే అంశాలు ఏంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి జనాలకు ఆసక్తి ఉంటుంది. మరి ఉగాది తర్వాత సింహ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి అనే దాని గురించి ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ప్రదీప్ జోషి.. సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
వారు తెలిపిన ప్రకారం.. ” సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏడవ ఇంట శని ఉన్నాడు. పదవ ఇంట గురు గ్రహం ఉన్నాడు. ఇది వారికి చాలా క్లిష్టమైన సందర్భము.. పదవులు పోతాయి. అవమానాలు ఎదుర్కొంటారు. అనుమానం ఎక్కువ అవుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. అహంకారం ఎక్కువైపోతుంది. మీ అహంకారం వలన కష్టాలు కొనితెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. మానసికంగా ఎదగలేకపోతారు. అలానే మార్పును గ్రహించలేకపోతారు. ఎవర్ని బడితే వారిని తిట్టేస్తారు.. కోపం ఎక్కువ అయిపోతుంది. చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి గ్రహాల అనుకూలత లేదు. కాబట్టి సింహరాశి వారు ఎంత సమన్వయంగా ఉంటే అంత మంచిది. ఎంత నవ్వుతూ అందరిని పలకరిస్తే అంత మంచిది.
ఎంత కోపం తగ్గించుకుంటే అంత మంచిది. సింహరాశి వారికి ముఖ్యంగా కాంట్రాక్టర్లకి ప్రభుత్వం నుంచి డబ్బులు రావు. కాబట్టి ఏ ప్రభుత్వం అయితే కాంట్రాక్టర్లకు సరిగ్గా బిల్లులు చెల్లించదో.. అలాంటి ప్రభుత్వానికి టెండర్లు వేయడం మానేయండి. అది ఏ ప్రభుత్వం అనేది మీరు తెలుసుకోండి. రాజకీయ నాయకులకు కూడా పదవి భంగం జరిగే అవకాశం ఉంది. అలాగే చెప్పుడు మాటలు వింటారు. అలాగే రాజకీయాల్లో మార్పులు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ చుట్టు ఉండే వారే మీకు వెన్ను పోటు పొడుస్తారు. మొత్తంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా వెన్నుపోట్లు ఎక్కువగా ఉంటాయి.
సూర్యుడు, శుక్రుడు మధ్య మధ్యలో మారుతు ఉంటారు. ఆ మారిన సందర్భంలో అనుకూలించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మాత్రం స్థిరత్వం ఉంటుంది. ఇందులో అయితే ఇబ్బందులు ఏమి ఉండవు. కాబట్టి ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారు జాగ్రత్తగా పనిచేసుకుంటూ ఉండండి. అలానే వ్యాపారం చేసే వారికి మాత్రం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వీరికి కోపం ఎక్కువ కాబట్టి.. కాస్త ఓర్పు అనేది రావడం కోసం అక్షయ తృతియ రోజు మహాలక్ష్మి యాగం చేయండి. శ్రావణ మాసంలో లక్ష్మీవ్రతం చేయడం వలన మంచి జరుగుతుంది. ముఖ్యంగా గణపతి యాగం చేయించుకోవాలి” ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి.