భారత దేశంలో ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. పూర్వ కాలంలో రాజులు తమ పరిపాలన గురించి భవిష్యత్ తరాల వారికి తెలిసే విధంగా దేవాలయాలు నిర్మించేవారు. వాటి ముందు శిలాఫలాకాలపై తమ రాజ్య పాలనగురించి లికించేవారు.
మన దేశంలో శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన కట్టడాలు, దేవాలయాలు నేటికీ చూస్తూంటాం. రాజుల కాలంలో వారి పరిపాలనలో భాగంగా ప్రజా శ్రేయస్సు, సుఖశాంతుల కోసం ఆలయాలను నిర్మించారు. దేవాలయాల ద్వారా నిర్మించిన రాజుల చరిత్ర, ఆనాటి శిల్పకళ, సాహిత్యం ప్రజలకు తెలుస్తుంది. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మనల్ని పాలించిన రాజులలో కాకతీయలు ఎంతో గొప్ప పేరు పొందినవారని తెలిసిందే. కాకతీయులు ప్రజల పాలన సుఖశాంతులతో అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. వీరు అనేక చెరువులను తవ్వించారు.. కాలువలు నిర్మించారు. అనేక దేవాలయాలను నిర్మించారు. వారి నిర్మాణానికి రామప్పదేవాలయం, వేయిస్తంభాల గుడి చాలా ప్రాముఖ్యత పొందినవి. పురాతన ఆధ్యాత్మికత కలిగిన ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఆ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరరావుపేట మండల కేంద్రంలో సీతారామస్వామి ఆలయం ఉంది. ప్రతీ సంవత్సరం ఇక్కడ శ్రీరామ నవమి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అశ్వ,గజ, శేష, సూర్యప్రభ, పొన్న, గరుడ, రథోత్సవాలు జరుగుతాయి. స్వామివారిని దర్శించుకోవడం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇక ఆలయ ప్రత్యేకత గురించి చెప్పాలంటే.. ఇక్కడ నిర్మించిన మూల విరాట్టు భద్రాచలంలో ఉన్న రాముడిని పోలి ఉంటుంది.
16 స్తంభాలతో గర్భాలయం, 16 రాతి స్తంభాలతో కూడిన ముఖమండపం, 16 స్తంభాలతో కళ్యాణమండపం ఏర్పాటు చేయబడింది. గంటపైభాగ సంస్కృత భాషలో ఆలయ చరిత్రను లిఖించారు. ప్రజల శ్రేయస్సును కోరి కాకతీయులు వెలిగించిన దీపం అఖండ దీపం నేటికీ వెలుగుతూనే ఉంది. అయితే ఈ ఆలయాన్ని 2018న పునర్నిర్మించుటకు భక్తుల విరాళాలతో ముందుకు రావాలని ఆలయ కమిటీ కోరుతున్నారు. ఈ ఆలయ ప్రత్యేకతలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.