మన దేశం ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయం అని చెప్పవచ్చు. చాలా ఆలయాల్లో ఏడాది పొడవున భక్తులు దర్శనం ఉంటుంది. కానీ కొన్నిఆలయాల్లో మాత్రం సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అలాంటి ఎన్నో ఆలయాల్లో సంగమేశ్వర ఆలయం ఒకటి. నంద్యాల జిల్లాలోని శ్రీ సంగమేశ్వర ఆలయం ఏడాది కాలంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే ఈ ఆలయం నాలుగు నెలలు మాత్రమే దర్శనం ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ప్రసిద్ధ శైవక్షేత్రల్లో ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో సంగమేశ్వరం ఆలయం ఒకటి. ఈ దేవాలయం కృష్ణా నది లో ఉంది. ఈ ఆలయంలో వేపలింగా శివుడిని భీముడు ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. వేపదారు శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఇక్కడ సప్త నదులు సంగమం కాబట్టి ఈ దేవాలయానికి సంగమేశ్వరం అని పేరు వచ్చింది. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు ఒక చోట కలిసి ఈ ప్రదేశాన్ని సంగమేశ్వరం అని పిలుస్తారు. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ స్టోరేజి అంతగా సంగమేశ్వరం పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది.
దీంతో శ్రీశైలంలో నీటి మట్టం పెరిగేకొద్ది.. సంగమేశ్వర గుడి..కొంచెం..కొంచెంగా మునిగిపోతుంది. చివరికి సంగమేశ్వ ఆలయం పూర్తిగా జలగర్భంలో కలిసిపోతుంది. ఇలా నాలుగు నెలల పాటు సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలో సేద తీరుతాడు. తిరిగి నాలుగు నెలల అనంతరం కొంచెం..కొంచెంగా బయట పడుతుంది.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు శుక్రవారం మధ్యాహ్నానికి శ్రీశైలంలో 838 అడుగులకు నీరు చేరడంతో సంగమేశ్వరుడి గర్భాలయంలోకి నీరు చేరింది. అదే రోజు సాయంత్రానికి నీటి మట్టం 842 అడుగులకు చేరడంతో ఆలయంలోని మూల విరాట్ ను కృష్ణమ్మ తాకింది.
ఎగువ ప్రాంతాల్లో కురుసున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరడంతో ఆలయం నీట మునిగింది. సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని కృష్ణా జలాలు తాకాయి. దీంతో ఆలయ పూజారి సంగమేశ్వరుడికి చివరి పూజలు చేశారు. కృష్ణమ్మకు కూడా పూజ చేసి చీర సారె సమర్పించి, మంగళ హారతి ఇచ్చారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో గుడి పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే మళ్లీ స్వామివారి దర్శనం కోసం ఎనిమిది నెలలు ఆగాల్సిందే.
గత ఏడాది కూడా జులైలోనే సంగమేశ్వరుడి గుడి గర్భాలయంలోకి నీరు ప్రవేశించింది. సంగమ తీరంలో గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఆలయం నీట మునిగిన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వీలుంటే మీరు ఒకసారి సంగేమేశ్వర ఆలయానికి దర్శిచండి. మరి.. ఈ సంగమేశ్వర ఆలయ విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.