గత కొంత కాలం నుంచి హిందువుల పండుగల నిర్వహణకు సంబంధించి అనేక వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా పండుగ నిర్వహణ తేదీల్లో పలు అభ్యంతరాలు, అనుమానాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక ఈ ఏడాది దీపావళి పండుగ విషయంలో కూడా ఇలాంటి సందేహాలే ప్రజల్లో నెలకొన్నాయి. తిథులు, నక్షత్రాల ప్రకారం ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి సందేహాలు తెర మీదకు రాగా.. తాజాగా అదే రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో.. అనేక అనుమానాలు, ప్రచారాలు, భయాలు తెర మీదకు వచ్చాయి.
ఇక 2022వ సంవత్సరంలో రెండవది, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. పాక్షిక సూర్యగ్రహణం. ఇక అదే రోజున దీపావళి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో గ్రహణం ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి.. పండుగ రోజే ఇలా సూర్యగ్రహణం ఏర్పడటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. ఆ రోజున ఏ నియమాలు పాటించాలి వంటి తదితర విషయాల గురించి రమా రావి సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా వివరించారు. చిన్నారులు, గర్భవతులు, ఇతరులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.