Sri Rama Navami: శ్రీరామ నవమి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగిది. శ్రీరామ చంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి రోజున పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే, హిందూ పండుగలలో శ్రీరామ నవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పండుగ రోజున ఆవు నెయ్యితో దీపాలు వెలిగించటం.. స్వామి పూజకు పసుపు పూలను లేదా ఎర్ర పూలను వినియోగించటం.. ఉపవాసం ఉండటం సాధారణంగా చేస్తూ ఉంటారు. ఏం చేయాలో తెలియకపోతే తెలుసుకుని మరీ చేస్తుంటారు. అయితే, పండుగ రోజున కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. చేయకూడని పనులను చేయకుండా ఉంటే.. పూర్తి పూజా ఫలాన్ని పొందవచ్చు. రామ చంద్రమూర్తి కృపకు పాత్రులం కావచ్చు.
శ్రీరామ నవమి రోజున చేయకూడని పనులు :
పండుగ రోజున స్వామి వారి కళ్యాణం అయ్యేవరకు ఎలాంటి ఆహార పదార్ధాలను తీసుకోకూడదు. కల్యాణం తర్వాత మొట్టమొదట పానకాన్ని నోట్లో వేసుకున్న తర్వాతే మిగిలిన ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, మెడిసిన్స్ వాడే వారు పండ్లను తీసుకోవచ్చు. అరటి పండ్లు, దానిమ్మ, స్వామి వారికి ఎంతో ఇష్టమైన ద్రాక్ష పళ్లను తినొచ్చు. పూజలు చేస్తున్నపుడు భక్తి శ్రద్ధలు తప్పక ఉండాలి. మనిషి ఓ చోట మనసు ఓ చోట పెట్టి పూజలు చేస్తే ప్రతిఫలం ఉండదు. నవమి రోజు పూజల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఒక క్రమపద్ధతిలో అన్నీ చేయాల్సి ఉంటుంది.
తెలిసిన వరకు చక్కగా చేయటం ముఖ్యం. వాళ్లు చెప్పింది, వీళ్లు చెప్పింది విని అస్తవ్యస్తంగా పూజలు చేయకూడదు. చాలా మందికి పండుగల పూట కూడా మాంసం తినే అలవాటు ఉంటుంది. పండుగ రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలి. మాంసతో పాటు మందుకు కూడా దూరంగా ఉండాలి. వంటలలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి. ఈ రెండు లేకుండా వంటలు చేసుకోవాలి. శ్రీరాముడు అంటే తండ్రి మాట జవదాటని వాడన్న పేరు ఉంది. అందుకే, పెద్దల పట్ల ఎంతో గౌరవ ప్రవర్తులతో నడుచుకోవాలి. తోటి మనుషుల పట్ల కూడా మంచిగా నడుచుకోవాలి. కేవలం మనషుల పట్లే కాదు జంతువులతో కూడా దయతో వ్యవహరించాలి. పండుగ రోజు జుట్టు కత్తిరించుకోవటం, గడ్డం చేయించుకోవటం వంటివి చేయకూడదు.
ఇవి కూడా చదవండి : అమెరికాలో వీధికి హిందూ దేవాలయం పేరు..