ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులపై దృష్టిసారించారు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా విజయ నగరంలో పర్యటించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకు స్థాపన చేశారు. ఈ పర్యటన సమయంలో కూడా సీఎం తన పెద్ద మనస్సు చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ అభివృద్ధి పనులతో దూసుకెళుతుంది. ప్రజా సంక్షేమం కోసం పథకాలు రూపొందించింది. నిరుద్యోగాన్ని పారదోలేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. వేలల్లో ఉద్యోగాలు కల్పించింది. అలాగే వాలంటీర్లను ఏర్పాటు చేసి.. ఇంటి వద్దకే ఫించనును అందిస్తుంది. ఇంటి వద్దకే రేషన్ వంటి సదుపాయాలతో పాటు ప్రజలకు ఇతర ప్రభుత్వ సేవలు చేరువయ్యేలా చేస్తుంది. అయితే ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులపై దృష్టిసారించారు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా విజయ నగరంలో పర్యటించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకు స్థాపన చేశారు. ఈ పర్యటన సమయంలో కూడా సీఎం తన పెద్ద మనస్సు చాటుకున్నారు.
విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపనకు వెళ్తున్న జగన్ కారు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఓ చిన్నారితో తల్లిదండ్రులు ఆవేదనను గమనించిన ఆయన.. తన హెలిప్యాడ్ వద్దకు తీసుకురావాలని తన సిబ్బందిని ఆదేశించారు. అక్కడకు వెళ్లాక వారి వినతిని విన్న ఆయన వెంటనే పాపకు మెరుగైన వైద్యం ఉచితంగా అందేలా చూడాలని ఆదేశించారు. నిధులతో సంబంధం లేకుండా పూర్తి వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయన ఇలా సాయం చేయడం కొత్తేమీ కాదు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అనేక మార్లు పరిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్పటికప్పుడే ఫించను మంజూరు చేసిన దాఖలాలు ఉన్నాయి. సాయం అడిగిన వారికి లేదనకుండా చేసిపెడతారు.