హిందువులకు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. హరిహరులకు పీత్రపాత్రమైన ఈ కార్తీక మాసంలో.. నిత్య దీపారాధన చేస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు విశిష్ట పూజలు నిర్వహిస్తారు. ఆయా దేవుళ్లకు సంబంధించిన మాలధారణ కూడా ఈ మాసంలోనే తీసుకుంటారు. కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ప్రభోదిని ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్నే దేవదత్తుని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఇక ఈ రోజున ఎవరూ కూడా మధ్యాహ్నం నిద్ర పోరు. ఆ మరుసటి రోజే అంటే ద్వాదశి తిథి నాడు తులసి వివాహం కూడా నిర్వహిస్తారు. ఈ తులసి వివాహం గురించి పురాణాల్లో కూడా ఉంది.
ఇక హిందూ సనాతన ధర్మంలో తులసి మొక్కను పరమ పవిత్రంగా పూజిస్తారు. తులసి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభించడంతో పాటు.. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఇక ఈ ఏడాది నవంబర్ 5 కార్తీక ద్వాదశి వచ్చింది. ప్రతి ఏటా ఈ రోజునే తులసి వివాహం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తులసి వివాహ ప్రాముఖ్యత, పూజా ముహుర్తం, పూజా విధానం గురించి పూర్తి వివరాలు మీకోసం..
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన శనివారం నాడు సాయంత్రం 6:08 గంటలకు కార్తీక ద్వాదశి తిథి ప్రారంభమయ్యి.. 6వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 5:06 గంటలకు ముగుస్తుంది. కనుక నంబర్ 5 సాయంత్రం 6 గంటల తర్వాత తులసి పూజను ప్రారంభించవచ్చు.
తులసి వివాహం పూజ చేయదలిస్తే.. ఆ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకోవాలి.
హిందూ మతంలో తులసి వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక పురాణాల ప్రకారం.. .శ్రీ మహావిష్ణువు.. ఆషాఢ మాసం, శుక్ల పక్షంలోని దేవశయని ఏకాదశి రోజు నుంచి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు. అయితే కార్తీక మాసంలోని దేవుత్తని ఏకాదశి రోజున మళ్లీ మెలకువలోకి వస్తాడు. ఆ తర్వాతి రోజే అనగా ద్వాదశ తిథి నాడు.. శ్రీమహా విష్ణువు..తులసిని తన శిలాగ్రామ అవతారంతో వివాహం చేసుకుంటాడు. అనాదికాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తులసి చెట్టుకు సాలగ్రామంతో వివాహం చేయడం ద్వారా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందదని.. కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.