తెలుగువారు ఎంతో సంతోషంగా జరుపుకునే పండగల్లో ఉగాది ప్రముఖమైనది. ఉగాది పర్వదినం రోజున ఏ పనులైతే చేస్తామో అదే పనిని సంవత్సరం అంతా చేస్తామని పెద్దలు చెబుతూ ఉంటారు. అలానే ఉగాది పండగ రోజు కొన్ని పనులు చేయకూడదని పండితులు అంటున్నారు.
హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో ఉగాది ఒకటి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. నూతన తెలుగు సంవత్సరంలో హిందువులు జరుపుకునే తొలిపండగ ఈ ఉగాది. ఈ పర్వదినాన పొద్దున్నే స్నానాలు చేసి.. కొత్త దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. వసంత రుతువు ప్రారంభం అవగానే ప్రతి ఒక్కరిలో కొత్త చైతన్యం ఏర్పడుతుంది. పండితులు చెప్పిన విషయాల ప్రకారం ఉగాది రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదట. మరి.. ఎలాంటి పనులకు ఉగాది పండగా రోజున ఉండాలలో ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగువారు ఎంతో సంతోషంగా జరుపుకునే పండగల్లో ఉగాది ప్రముఖమైనది. ఈ పండుగ రోజున ఏడు రుచులను కలిపి ఉగాది పచ్చడిగా చేసుకుని స్వీకరిస్తాము. తీపి, చేదు, పులుపు, కారం ఇలా అన్ని రుచులతోనూ మేళవించి తినడం అనేది మన సంస్కృతిలో భాగంగా వస్తున్న ఆచారం. ఉగాది పర్వదినం రోజున ఏ పనులైతే చేస్తామో అదే పనిని సంవత్సరం అంతా చేస్తామని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉగాది పండగ రోజు అమ్మవారికి పూజలు చేస్తారు. దేవతకు ఉపారాలు పెట్టడం చేస్తుంటారు. ఉగాది పండగ నుంచి బుతువులు మారుతుంటాయి.
అందుకే ఈ పండగ రోజు గ్రామ దేవతలకు అన్ననివేదన చేయడం ఓ పద్దతిగా ఉంటుంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ రోజునే మొదలవుతుంది. ఈ రోజు అందరు కొత్త దుస్తులు ధరించి.. పూజాలు చేస్తారు. రామాయణ పారాయణం చేస్తుంటారు. అలానే తమ గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నదీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు. ఆదాయ వ్యయాలు, తెలుసుకుని జాగ్రత్తపడాలనుకుంటాము. అంతేకాదు ఈ రోజున విసన కర్రలను దానం చేస్తే మంచి మేలు జరుగుతాయి. అయితే ఇదే పండుగ రోజు ఎలాంటి పనులు చేయకూడదో కూడా పెద్దలు సూచించారు.
ఉగాది రోజు ఆలస్యంగా నిద్ర లేవరాదు. మద్యం మాంసం వంటివి తినకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్, సిగరేట్, మాంసాహారాలను చేయకూడదు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే అయిదు అంగాలు కలిగిన కాలజ్ఞానాన్నే పంచాంగం అంటారు. దక్షిణం ముఖంగా కూర్చుని ఈరోజున పంచాంగ శ్రవణాన్ని చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారట. కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఉంటే మంచి జరుగుతుందిని పండితులు తెలిపారు. ఉగాదికి సంబంధించిన మరిన్ని విషయాల కోసం ఈ పూర్తి వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.