Mithuna Rasi (Gemini) Ugadi Telugu Panchagam 2023: తెలుగు వారు తమ పండుగలను ఎంతో ఆనందోత్సాహల మద్య జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 21 న మంగళవారం ‘శుభకృత’ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. మార్చి 22వ తేది బుధవారం రోజున శ్రీ ‘శోభకృత్’ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.
ప్రపంచంలో ఉన్న తెలుగు వారు ప్రతి పండుగను ఎంతో ఆనందోత్సాహల మద్య జరుపుకుంటారు. వాటిలో విశిష్టమైనది ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచుల పచ్చడి తింటారు.. తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు ఇలా మన జీవితంలో ఉండే కష్టసుఖాలన్నింటికీ పచ్చడి ప్రతీక అని చెబుతుంటారు పెద్దలు. ఈ ఏడాది మార్చి 21 న మంగళవారం ‘శుభకృత’ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. మార్చి 22వ తేది బుధవారం రోజున శ్రీ ‘శోభకృత్’ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఉగాది నాడు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తప్పకుండా చేసే పని పంచాగం శ్రవణం. ఈ ఏడాది ఎలా ఉండబోతుంది.. ఏ ఏ రాశుల వారు కష్ట సుఖాలను ఎదుర్కొనబోతున్నారు. అనే విషయాల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉండబోతుంది.. ఏ ఏ అంశాలు కలిసి వస్తాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి జనాలకు ఆసక్తి ఉంటుంది. మరి ఉగాది తర్వాత మిధున రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి అనే దాని గురించి ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ప్రదీప్ జోషి.. ఆసక్తికర వివరాలు వెల్లడించాడు.
ఈ ఏడాది సంవత్సరం భోగభాగ్యాలు ఇచ్చేది కనుక శ్రీ ‘శోభకృత్’ నామ సంవత్సరం అని అంటారు. అన్ని రాశుల్లో మంచి రాశి మిధున రాశి. మిధున రాశి వారికి ఓ అదృష్టం కలిసివచ్చే సూచన ఉంది.. తొమ్మిదవ స్థానం లోపల శనిగ్రహం వచ్చింది.. పదవ స్థానంలో గురు గ్రహం ఉంది. ఈ రాశీ వారికి శుక్రుడు మారినపుడు అన్నీ కలిసి వస్తుంటాయి. ఈ ఏడాది మిథున రాశీ వారు నోటు పత్రాలు, హామీ పత్రాల జోలికి వెళ్లాకూడదు. ఐటీ రంగాంలో ఉన్న ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దొరికే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులకు విదేశీ యోగం ఉంటుంది. ఈ ఏడాది మిథున రాశీ వారు నమ్మకద్రోహానికి గురైయ్యే అవకాశం ఉంది.. కనుక అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ ఏడాది రైతులకు బాగా కలిసి వస్తుంది. రైతులు ఐదో నెలకు సరిపడ తీగ పంటలు వేసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉల్లి, టమాటా పంటలు వేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉన్నట్టు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ప్రదీప్ జోషి తెలిపారు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ క్రింది వీడియోని చూడండి.