ప్రపంచమంతా జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకుంటే.. మన హిందువులు మాత్రం ఉగాది పర్వదినంతో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. అప్పటివరకూ పచ్చడి మెతుకులు తిని బతికిన పేదలు కూడా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి ఉగాది పచ్చడి చేసుకుని నోటితో పాటు జీవితాన్ని తీపి చేసుకుంటారు. ఏడాది మొత్తం తమ జీవితం బాగుండాలని ఆ దేవుడ్ని కోరుకుంటారు. అయితే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. ఈ నూతన సంవత్సరాన, ఉగాది నుంచి తమ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. మరి మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసుకోండి.
హిందూ సంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం ఉగాది పర్వదినంతో మొదలవుతుంది. శోభకృత్ నామ సంవత్సరాన ఉగాది వచ్చింది. శోభకృత్ లోనే శోభ ఉంది. శోభ అంటే వైభవం. ఈ ఏడాది దాదాపు అందరి జీవితాలు శోభాయమానంగా, వైభవంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలకు జనవరి 1న నూతన సంవత్సరం అయితే.. మన హిందువులకు మాత్రం ఉగాదితోనే కొత్త ఏడాది మొదలవుతుంది. తెలుగు పంచాంగం తీసి ఈ కొత్త ఏడాది ఎలా ఉందో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రముఖ జ్యోతిష్కులను కలిసి తమ జాతకం ఎలా ఉందో అని తెలుసుకునేందుకు మక్కువ చూపిస్తారు. మరి ఈ నూతన ఏడాదిన మీ రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి? మీనరాశి వారికి జాతకం ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పుడు తెలుసుకోండి.
ప్రముఖ జ్యోతిష్కుడు సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఉగాది నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో అనే విషయాలను వివరించారు. ఈ క్రమంలో మీన రాశి వారి జీవితంలో జరిగే మార్పులు, చోటు చేసుకునే పరిణామాలు ఏంటి అనేవి చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు, కొన్ని ఉద్యోగాలు చేసేవారి జీవితాల్లో పెద్ద మార్పు ఉండదని అన్నారు. అయితే ఉద్యోగులకు ఫ్రెండ్స్ వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉందని, రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ తప్ప గొప్ప లాభాలు ఏమీ ఉండవని అన్నారు. ఈ మీన రాశికి చెందిన ప్రైవేటు ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు దాచుకున్న డబ్బుతో బంగారమో, భూమో కొనుక్కునే అవకాశం ఉంటుందని, తాతల నుంచి వచ్చిన ఆస్తి వల్ల కలిసొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
వ్యాపారస్తుల జీవితంలో కొంతమందికి లాభాలు జరుగుతాయని.. మరి కొంతమందికి నష్టాలు ఉంటాయని అన్నారు. మీన రాశి వారు ముఖ్యంగా చెడు చూడడం, చెడు వినడం, చెడు మాట్లాడడం వంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. వీటికి దగ్గరైతే శనిగ్రహానికి గేలం వేసినట్టే అవుతుందని అన్నారు. నిజాయితీగా, ఖచ్చితంగా ఉంటే జీవితం బాగుంటుందని అన్నారు. గొడవలకు పోకుండా ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా సాగుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లను నమ్ముకుని లావాదేవీలు చేయవద్దని.. ఎవరికైనా భూమి అమ్ముకునేందుకు అగ్రిమెంట్లు చేసుకుంటే నష్టపోతారని అన్నారు. ఇంకా ఎన్నో విషయాలు మీన రాశి వారి గురించి కింది వీడియోలో ప్రస్తావించారు. దయచేసి వీడియో చూడగలరు.