ప్రతి సంవత్సరం మాఘ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి రోజున మహా శివరాత్రిని జరుపుకుంటారు. అయితే ఈ సారి శివరాత్రి అత్యంత ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ శివరాత్రి.. శనిత్రయోదశితో కలిసి వచ్చింది. అయితే మహా శివరాత్రిని ఒక క్రమ పద్దతిలో ఎలా జరుపుకోవాలి అన్న విషయంలో చాలా మందికి సందేహాలు నెలకొన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేశారు పండితులు.
మాఘ మాసంలో వచ్చే శివరాత్రినే మహా శివరాత్రి అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహా శివరాత్రి కోసం శివ భక్తులు ఏడాది మెుత్తం ఎదురుచూస్తుంటారు. ఈ రోజున పరమ శివుడికి పాహిమాం అంటూ పూజలు, భజనలు, అభిషేకాలు చేస్తూ అనుగ్రహం పొందడానికి, ఆ శివుడి చల్లని చూపు తమ మీద ఉండాలనుకుంటారు. అయితే మహా శివరాత్రిని ఒక క్రమ పద్దతిలో ఎలా నిర్వహించుకోవాలో చాలా మందికి తెలీదు. ఏ పద్దతిలో మహా శివరాత్రిని నిర్వహిస్తే.. పుణ్యం లభిస్తుందో పండితులు ఈ కింద చెప్పుకొచ్చారు.
ప్రతి సంవత్సరం మాఘ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి రోజున మహా శివరాత్రిని జరుపుకుంటారు. అయితే ఈ సారి శివరాత్రి అత్యంత ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈసారి శివరాత్రి.. శనిత్రయోదశితో కలిసి వచ్చింది. అందుకే ఈ మహా శివరాత్రి అద్భుతమైనదిగా పండితులు చెప్పుకొస్తున్నారు. అయితే మహా శివరాత్రిని ఒక క్రమ పద్దతిలో ఎలా జరుపుకోవాలి అన్న విషయంలో చాలా మందికి సందేహాలు నెలకొన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేశారు పండితులు. మహా శివరాత్రి అసలైన పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేవాలి. అనంతరం బావి నీళ్లతో తల స్నానం చేయాలి. ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని, శివలింగం లేదా శివుడి ఫోటో ఎదురుగా దీపం వెలిగించాలి. పూజ ప్రారంభించినప్పటి నుంచి మనసులో పంచాక్షరీ మంత్రం ‘ఓం నమఃశివాయ’ను నిత్యం జపిస్తుండాలి. ఆ తర్వాత రుద్రాక్షలను శివ లింగం వద్ద ఉంచి, కర్పూరం వెలిగించి.. గంట మోగిస్తుండాలి. ఇక శివ లింగానికి అభిషేకం చెయ్యడానికి గంగాజలంతో పాటుగా పాలు, తేనే, నెయ్యి, పెరుగు అయిన పంచామృతాలను తీసుకోవాలి. ఈ పంచామృతాలతో అభిషేకం నిర్వహించాలి. అయితే అభిషేకం నిర్వహించే క్రమంలోనే శివుడు తాండవం చేస్తాడని చాలా మంది భక్తుల నమ్మకం.
ఇక శివరాత్రి పూజలను నాలుగు దశల్లో నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు మెుదలైన పూజ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ముగుస్తుంది. ఇక శివరాత్రి జాగార సమయంలో శివుని పాటలు వింటూ భజన చెయ్యాలి. ఈ రోజు మెుత్తం మనసులో శివ నామస్మరణే ఉండాలి. ఇక శివరాత్రి మరుసటి రోజు ఆహార పదార్థాలను, వస్త్రాలను, ఛత్రం వంటి వాటిని దానం చెయ్యాలని మన పురాణాలు చెబుతున్నాయి. అన్ని పూజలు చేసినప్పటికీ దానం చెయ్యకపోతే పుణ్యం లభించదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇక చివరిగా శివ పార్వతుల విగ్రహాలకు లేదా ఫోటోలకు పువ్వులు, బిల్వ పత్రాలు సమర్పించాలని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఎవరి స్థోమతకి తగ్గట్లుగా వారు తమతమ పరిధిలో శివరాత్రిని నిర్వహించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.