మహా శివరాత్రి రోజున శివ భక్తులు తప్పకుండా ఉపవాసం ఉంటారు. ఈ రోజును అత్యంత భక్తి శ్రద్దలతో, పూజలతో, శివుడికి అభిషేకాలు నిర్వహిస్తూ.. శివ నామస్మరణాన్ని జపిస్తూ గడుపుతారు. అయితే ఈ ఉపవాసం రోజు ఏ ఆహారపదార్థాలు తీసుకోవాలి, ఏం తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివరాత్రి.. హిందూ సనాతన సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పండుగ. దాంతో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహా శివరాత్రిని భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది శివరాత్రి.. శనివారం నాడు.. అందులోనా శనిత్రయోదశి రోజున వస్తుంది. దాంతో ఈసారి శివరాత్రి విశిష్టమైనదిగా చెబుతున్నారు పండితులు. ఇలా శనిత్రయోదశితో కలసి రావడం వల్ల అద్భుతమైన యోగం, బలాన్ని అందించే పర్వదినంగా ఈ శివరాత్రి నిలుస్తుంది అంటున్నారు పండితులు. ఇక శివరాత్రి అనగానే మనకు ముందుగా మదిలో మెదిలేది ఉపవాసం, జాగారం. అయితే చాలా మందికి ఉపవాసం రోజున ఏ పదార్థాలు తినాలో, ఏ పదార్థాలు తినకూడదో అనుమానం ఉంటుంది. ఈ క్రమంలోనే శివరాత్రి ఉపవాసం రోజు ఏ ఆహార పదార్థాలు తినాలో, వేటిని ముట్టుకోకూదో ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివరాత్రి రోజున శివ భక్తులు తప్పకుండా ఉపవాసం ఉంటారు. ఈ రోజును అత్యంత భక్తి శ్రద్దలతో, పూజలతో, శివుడికి అభిషేకాలు నిర్వహిస్తూ.. శివ నామస్మరణాన్ని జపిస్తూ గడుపుతారు. అయితే ఉపవాసం ఉండే క్రమంలో చాలా మందికి ఏ ఆహార పదార్థాలు తినాలో, వేటిని తినకూడదో తెలీక తికమక పడుతుంటారు. మహా శివరాత్రి రోజు తెల్లవారు జామున ప్రారంభం అయిన ఉపవాసం మరుసటి రోజు ఉదయంతో ముగుస్తుంది. చాలా మంది శివరాత్రి రోజు ‘నిర్జల వ్రతాన్ని’ మాత్రమే ఆచరిస్తారు. అంటే ఈ వ్రతం ఆచరించే భక్తులు కేవలం నీరు మాత్రమే తాగుతారు.
అయితే చాలా మంది ఈ ఉపవాసం రోజున పండ్లు లేదా పాలు, నీళ్లు, స్వీట్స్ లాంటి వాటిని సేవించి ఉపవాసం చేస్తుంటారు. అయితే ఉపవాసంలో మీరు తినాల్సినవి, తినకూడని పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి ఉపవాసంలో.. బియ్యం, గోధుమ, పప్పులు లాంటి తృణధాన్యాలకు దూరంగా ఉండాలి. పండ్లు, ఉడకబెట్టిన చిలకగ దుంప లాంటి పదార్థాలను తినొచ్చు అని చెబుతున్నారు పండితులు. ఇక వీటితో పాటుగా సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం జావ లను అల్పాహారంగా తీసుకోచ్చు. అదీకాక మీ శరీరం హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి అంటే.. మిరియాలు, యాలకులు, బాదం, గసగసాలు కలిపి తాండాయి పానీయాన్ని తయారు చేసుకుని సేవించండి. ఇది మీ శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
ఈ క్రమంలోనే శివరాత్రిన తినే ఆహారంలో ఉప్పు ఉపయోగించాల్సి వస్తే.. రాతి ఉప్పుని మాత్రమే ఉపయోంగిచాలని ప్రముఖ పండితులు చెబుతున్నారు. ఇక ఎలాంటి మాంసాహార పదార్థాల జోలికి వెళ్ల కూడదు. అయితే ఉపవాసం చేసే క్రమంలో కొందరికి ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అనారోగ్యం బారిన పడి మెడిసిన్ తీసుకుంటున్న వారు, ఇతరత్ర కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారు ఉపవాసం చెయ్యకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. శివరాత్రి రోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండాలి కాబట్టి.. నీరసించి పోకుండా ఉండాలంటే పాలు, పండ్లు లాంటి శక్తిని ఇచ్చే పదార్థాలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఉపవాసం చెయ్యకపోవడంమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు.