ఉగాది నుంచే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ పర్వదినాన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉగాది అనగానే పంచాంగ శ్రవణానికి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కుంభ రాశి వారికిి ఎలా ఉండబోతోందో చూద్దాం.
హ్యాపీ న్యూయర్ అని కేకలు వేసి.. కేకులు కోసుకుని సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది. ఈ ‘శుభకృత్’ నామ సంవత్సరం ముగిసి.. మార్చి 22 నుంచి “శోభకృత్” నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఉగాది పర్వదినం అనగానే.. తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేస్తారు. దేవతారాధన చేసుకుని షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇంక ఈరోజు ఉగాది పచ్చడి, పిండి వంటలకే కాదు.. పంచాంగ శ్రవణానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ కొత్త సంవత్సరం తమకు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే కుంభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ ఆస్ట్రాలజర్ ‘ప్రదీప్ జోషి’ కుంభ రాశి వారికి ఈ శోభకృత్ నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో వివరించారు. “శోభకృత నామ సంవత్సరం అంటే అందరూ భోగ భాగ్యాలను అనుభవించే సంవత్సరం అంటారు. అందులో కుంభరాశి వారికి గుండెల మీద శని ఉంటే.. గురువు భుజాల మీద ఉంటాడు. మీకు డబ్బు, అవకాశాలతో పాటుగా బాధని కూడా ఇస్తాడు. గుండెల్లో బాధ, ఇంట్లో సమస్యలు ఉంటా. కానీ, అక్కడే మీకు అవకాశాలు కూడా ఉంటాయి. రెండో స్థానంలో గురువు ఉండటం వల్ల కుంభ రాశి వారు ఏ సమస్య నుంచైనా గట్టెక్కేస్తూ ఉంటారు. మీ సమస్యల నుంచి బయటపడేందుకు ఆ గురువు మీకు దారి చూపిస్తూ ఉంటాడు. కుంభ రాశి వారు గురువారం దత్తాత్రేయ ఆలయం, శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మంచిది.
ఈ ఏడాది మీరు తిరుమల కొండెక్కితే మంచి జరుగుతుంది. పెళ్లి కావాల్సిన వాళ్లు శ్రీనివాస మంగాపురం నుంచి కాలి నడకన శ్రీవారి దర్శనానికి వెళ్లండి. శ్రవణ నక్షత్రం, పునర్వసు నక్షత్రం ఉన్న రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్య శ్రీవారి ప్రాకారం చుట్టూ ‘ఓం నమో వేంకటేశాయా’ అంటూ ప్రదక్షిణ చేయండి. ఇలా చేస్తే మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి రెండేళ్లపాటు కాపాడతాడు. మకర, కుంభ, మీన రాశుల వారికి ఇది బాగా పనిచేస్తుంది. కష్టాల్లో ఉన్న ఏ రాశి వారైనా సరే ఇలా చేయడం వల్ల మంచి జరగుతుంది” అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి తెలిపారు. కుంభరాశికి సంబంధించి పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.