మన జీవితం సంతోషంగా గడపాలంటే డబ్బు అవసరం. కొన్ని తప్ప.. దాదాపు అన్ని సమస్యలు డబ్బుతో పరిష్కరం అవుతాయి. అందుకే ప్రతి వ్యక్తి అధిక మొత్తంలో డబ్బు సంపాందించాలని అనుకుంటాడు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడతాడు. దేవుళ్ల అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. ఎంత చేసినా కొందరి వద్దే డబ్బు ఉంటుంది. మరి కొందరు ఎప్పుడూ డబ్బు కోసం పాకులాడాల్సిన పరిస్థితులు ఉంటాయి.
హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి తన కెరీర్ లో ఎంత దూరం వెళ్తాడు. అతను ఎంత డబ్బు సంపాదించగలడో తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి చేతిలోని గీతలు అతని భవిష్యత్తు గురించి తెలియజేస్తాయని హస్తసాముద్రిక చెప్త్తుంది. హస్తసాముద్రికం లేదా సాముద్రికం అనేది అరచేతిని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు గురించి వివరించే కళగా చెప్పవచ్చు, దీనిని అరచేతి పఠనం లేదా చిరోలాజీ అని కూడా పిలుస్తారు.
ఈ శాస్త్రం ప్రకారం.. కొంతమంది అదృష్టవంతుల చేతుల్లో కొన్ని ప్రత్యేక గీతలు కలిగి ఉంటారు. ఆ గీతలు వ్యక్తి భవిష్యత్తులో చాలా డబ్బు సంపాదిస్తాడని సూచిస్తుంది. ఒక వ్యక్తి చేతిలో జీవిత రేఖతో అంగారక రేఖ కొనసాగితే, అది శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలాంటి రేఖ ఉన్న వ్యక్తికి బంధువుల నుంచి గాని, తమ పూర్వీకుల నుంచి గాని సంక్రమించే ఆస్తిని ఉపయోగించుకుంటాడు. అరచేతులకు ఒకటి కంటే ఎక్కువ అదృష్ట రేఖలు ఉంటే లేదా వేళ్ల పరిమాణం సమానంగా ఉంటే అలాంటి వ్యక్తులు చాలా ధనవంతులు అని హస్తసాముద్రికం వెల్లడిస్తుంది.
హస్తసాముద్రికం ఒక వ్యక్తి అరచేతులపై రేఖలు స్పష్టంగా ఉంటే, వారికి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. ఓ వ్యక్తి చేతిరేఖ స్పష్టంగా ఉంటే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అదే సమయంలో వ్యక్తి యొక్క బుధుడి వేలు సూర్యుని మూడో వేలు కంటే పొడవుగా ఉంటే వారు చాలా అధిక సంపదకు యజమానులుగా అవుతారని శాస్ర్త నిపుణులు చెబుతున్నారు. మరి మీరు కూడా మీకు ఇలాంటి రేఖలు ఉన్నాయేమో చూసుకోండి. ఈ హస్తసాముద్రిక శాస్ర్తం తెలిపే విషయాలపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.