భారత దేశంలో వివాహం అయిన మహిళలు కాలి-రింగ్(మెట్టెలు) ధరిస్తారు. అదీ ప్రత్యేకించి కాలి రెండో వేలుకు ధరించడం, అంతేకాకుండా వెండి ధాతువుతో తయారైనవే ధరించడం. కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారపు మెట్టెలు వాడినా అది సంప్రదాయానికి వ్యతిరేకం అంటారు. మహిళలకు వివాహం అయినదని అర్ధమే కాకుండా విజ్ఞానశాస్త్రంనకు కూడా సంబంధం ఉన్నది.
కాలు రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయి అంటారు ఆయుర్వేద నిపుణులు. నడిచే సమయంలో మెట్టెల ఘర్షణ ప్రేరితాలైన ఈ నాడీ కేంద్రాలు ఆరోగ్యవంతమైన, ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయంటారు. కాలి నుండి రెండవ వేలులో నిర్దిష్ట నాడులు గర్భాశయం మరియు గుండెకు అనుసందానము కలిగి ఉంటాయి.
భూమి నుంచి పోలార్ శక్తుల నుండి శక్తిని గ్రహించి ఆ శక్తి శరీరంనకు వెండి ద్వారా వెళుతుంది. అందువలన మొత్తం శరీరం వ్యవస్థ రిఫ్రెష్ అవుతుంది. భారతదేశ వేదాలలో రెండు కాళ్ళకు ధరించుట వలన తమ రుతు చక్రం విరామాలతో క్రమబద్ధీకరన ఉంటుందని చెప్పబడింది. దంపతులకు సకాలంలో పిల్లలు కలుగుతారని కూడా చెబుతున్నారు. మెట్టెలని భారత దేశంలో అందరు స్త్రీలు కుల మతాల కతీతంగా ధరిస్తారు.