కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు. ఎంత శోధించినా.. కారణాలు అంతుచిక్కవు. అలాంటివి వింతలు మనదేశంలో చాలానే కనిపిస్తాయి. తమిళనాడులో ఉన్న కుంభకోణం లోని తిరునాళ్ళూర్ అనే క్షేత్రం ఉంది. ఇక్కడ ఉన్న నాచ్చియార్ కోవెలనే తీసుకుందాం. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉన్నప్పటికీ.. ఇది శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి ఆలయం గానే ప్రసిద్ది చెందింది. ఎందుకంటే ఇక్కడి కి వచ్చే భక్తులకు వరాలు ఆయనే అనుగ్రహిస్తాడు. అంతే గాక ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు పెరుగుతుందట.
స్వామివారు అంతప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు.. అది తేలిగ్గా ఉండి నలుగురు మనుషులు మోస్తే సరిపోతుంది. కానీ ఆలయంలోని 5 ప్రాకారాలను దాటి సింహద్వారంలోకి వచ్చేసరికి విగ్రహం బరువు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతుందంటా. అంటే 2వ ప్రాకారాన్ని దాటుతున్నప్పుడు 8మంది, 3వ ప్రాకారాన్ని దాటేటప్పుడు 16మంది, 4వ ప్రాకారాన్ని దాటేటప్పుడు 32మంది, 5వ ప్రాకారాన్ని దాటేటప్పుడు 64మంది మోయాల్సి వస్తుంది.
5 ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడ వాహనం బరువు బాగా పెరిగిపోయి 128 మంది మోయాల్సి వస్తుంది. దాంతో 16 మంది మోస్తున్నా హంస వాహనం ముందు వెళ్తుండగా.. దాని వెనకాల 128 మంది మోస్తున్న గరుడ వాహనం నిదానంగా కదులుతూ ముందుకు వెళ్తుంది. మరో విశేషం ఏమిటంటే.. ఊరేగింపు సమయంలో గరుత్మంతుడి ఉత్సవ విగ్రహానికి చెమటలు కనిపిస్తాయి. స్వామి వారి విగ్రహం ప్రారంభంలో తక్కువ బరువు ఉండి.. క్రమంగా బరువు పెరిగే సరికి చెమట కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ బరువు ఎలా పెరుగుతుందని ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తోన్న. అసలు ఈ విగ్రహం రహస్యం ఏంటి అనేది ఈనాటి అంతు చిక్కలేదు. ఈ విషయంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.