అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సగం మేర పనులు పూర్తైనట్లు చెబుతున్నారు. 2024 జనవరి కల్లా సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనం కల్పిస్తామంటూ హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి రెండు అతిపెద్ద రాళ్లను తెప్పిస్తున్నారు. అవి నేపాల్ నుంచి గోరఖ్ పూర్ చేరుకున్నాయి. అక్కడి నుంచి వాటిని అయోధ్యకు తరలిస్తారు. ఎంతగానో వెతగ్గా రెండు అతిపెద్ద బండరాళ్లు దొరికినట్లు చెబుతున్నారు. వాటి బరువు కూడా టన్నుల్లో ఉంది.
అయోధ్య రామ మందిరం పనులు శరవేగంగా జరుగుతున్నాయ. ఈ రామాలయం ఎంత ప్రత్యేకమైందో అందరికీ తెలిసిందే. అందుకే సీతారాముల విగ్రహాలు చేసేందుకు రాళ్లు కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలని భావించారు. అందుకే నేపాల్ లోని గండకీ రాష్ట్రం ముస్తాంగ్ జిల్లాలో ప్రవహించే ‘కలిగండకీ’ నది నుంచి ఈ రాళ్లను సేకరించారు. అక్కడ ఎంతగానే వెతగ్గా రెండు పెద్ద రాళ్లు లభించాయి. వాటిలో ఒకటి 23 టన్నులు బరువు ఉండగా మరో రాయి 15 టన్నుల బరువు ఉన్నట్లు చెబుతున్నారు. నేపాల్ నుంచి రాళ్లను తరలించే ఈ కార్యక్రమం ఒక పడుగగా జరిగింది.
కలిగండకీ నది నుంచి సీతారాముల విగ్రహాల కోసం రాళ్లను తీసుకెళ్తున్నారని తెలుసుకుని స్థానికులు అంతా పెద్దఎత్తున తరలివచ్చారు. ఆ శాలిగ్రామ రాళ్లకు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శాలిగ్రామ రాళ్లు ఎంతో పవిత్రమైనవి. అంతేకాకుండా జనకరాజు కుమార్తె అయిన సీతా దేవిని జానకీ అని కూడా పిలుస్తారు. నేపాల్ లోని జనక్ పూర్ లో సీతాదేవికి ఆలయం కూడా ఉంది. ఆవిడ అక్కడే జన్మించినట్లు నమ్ముతారు. సీతాదేవిని వారి ఆడపడుచుగా భావిస్తుంటారు. అలాంటిది అయోధ్య సీతారాముల విగ్రహాల తయారీ గండకి నది నుంచి శాలిగ్రామాలు సేకరిస్తున్నట్లు తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు.
Uttar Pradesh: 2 Shaligram stones for Ram Mandir reach Gorakhpur from Nepal
Read @ANI Story | https://t.co/Is1NJzowEO#Shaligram #ShaligramStones #RamMandir #Ayodhya pic.twitter.com/rIF3mzC0Yr
— ANI Digital (@ani_digital) January 31, 2023
పురాణాల ప్రకారం శాలిగ్రమా రాళ్లు ఎంత పవిత్రమైనవి, ప్రత్యేకమైనవి. వీటిని శ్రీమహావిష్ణువుగా భావిస్తారు. వీటిని కట్ చేస్తే లోపల విష్ణు చక్రం మాదిరిగా ఉంటుంది. ఈ శాలిగ్రామాలు నేపాల్ లోని గండకి నది ఒడ్డున లభిస్తాయి. అంతేకాకుండా శ్రీమహావిష్ణువు ఎత్తిన పది అవతారాల్లో శ్రీరాముడు కూడా ఒకరని అందరి నమ్మకం. అలాంటి శాలిగ్రామ రాళ్లతోనే శ్రీరాముడి విగ్రహం తయారు చేయాలని నిర్ణయించారు. ఇలా శాలిగ్రామాలు కావాలని నేపాల్ ని సంప్రదించగా.. అక్కడి మాజీ డిప్యూటీ ప్రధాని బిమలేంద్ర నిధి స్వయంగా బాధ్యత తీసుకుని రెండు అతిపెద్ద శాలిగ్రామ రాళ్లను అయోధ్యకు పంపారు. అవి ప్రస్తుతం గోరఖ్‌పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో పూజలు అందుకున్నాయి. తర్వాత అక్కడి నుంచి అయోధ్యకు తరలిస్తారు.
UP | 2 Shaligram stones from Nepal arrive at Gorakhnath temple, Gorakhpur; will be taken to Ayodhya for Ram temple
“We’re very happy. We’ve done pooja (of the stones). They’ll be taken to Ayodhya soon to make idols of Lord Ram & Goddess Sita,” says a priest of Gorakhnath temple pic.twitter.com/lySOrDIhfR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 31, 2023