వేద గ్రంధాలు, సముద్ర శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు మనిషి శరీరంపై ఏ చోట ఉండాలి. ఉంటే గనుక కలిగే ప్రయోజనాలు, నష్టాలు కూడా ఉన్నాయనేది కొన్ని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. కానీ హిందూమతాన్ని పరమ భక్తిగా భావించే చాలా మంది ఇలాంటి పుట్టమచ్చల గురుంచి చాలా శ్రద్ద చూపిస్తూ ఉంటారు. ఈ పుట్టుమచ్చల వెనుక ఉన్న రహస్యాలను, ప్రయోజనాలను తప్పకుండా తెలుసుకోవాటానికే చాలా మటుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఇక అసలు విషయం ఏంటంటే..? మనిషి నుదిటి ఎడమ వైపు పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకు జీవితంలో చాలా అనర్ధాలు సంభవిస్తాయనేది వేద గ్రంధాలు చెబుతున్నాయి. ఇక ఇదే కాకుండా పెదవి ఎడమ వైపు భాగంలో కూడా పుట్టుమచ్చలు ఉంటే గనుక ఆ వ్యక్తి వివాహ విషయంలో చాలా మటుకు అనార్ధాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది. దీంతో పాటు పెదవి పై భాగంలో పుట్టమచ్చలు ఉంటే గనుక అదృష్టవంతులని, వారు కోరుకున్న భాగస్వాములు దొరుకుతారని సముద్ర శాస్త్రం తెలియజేస్తుంది. మరి నిజంగానే పుట్టమచ్చల వల్ల నష్టాలు, ఉపయోగాలు సంభవిస్తాయని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.