ఇటీవలే సూర్యగ్రహణం పూర్తవడం చూశాం. ఇప్పుడు నెలరోజుల వ్యవధిలోనే చంద్రగ్రహణం వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం రానుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుంది. అంటే దాదాపు 4 గంటల నిడివి ఉండనుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం ప్రపంచంలో నేపాల్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా(అన్ని దేశాలు), ఇండియా, కెనడా దేశాల్లో దీని ప్రభావం ఉండనుంది. ఈసారి చంద్రగ్రహణం మేషరాశిలో సంభవించనుంది. ఈ చంద్రగ్రహణం 8 మంది రాశుల వారికి ప్రతికూలంగా.. 4 రాశుల వారికి మాత్రమే అనుకూల ఫలితాలను ఇవ్వనుందని చెబుతున్నారు.
ప్రతికూల ఫలితాలు ఇచ్చే రాశులు ఏవంటే.. మేషరాశి, వృషభరాశి, కన్య, సింహరాశి, తులారాశి, ధనుస్సు, మకర, మీన రాశుల వారికి ఈ చంద్రగ్రహణం ప్రతికూల ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. వీరు దోషాలను, అశుభాలను తొలగించుకునేందుకు.. దానాలు చేయడం శ్రేయస్కరమని పండితులు వివరిస్తున్నారు. అందుకు కిలోన్నర బియ్యం, కిలోన్నర మినుములను మోదుగ ఆకులో పెట్టి.. వాటితోపాటుగా ఒక తెల్లటి వస్త్రం, నీలిరంగు వస్త్రాన్ని ఉంచాలి. కాస్త ఆర్థికంగా శక్తికలిగినవారు.. బంగారం లేదా వెండి లేదా రాగితో సర్ప ప్రతిమ, చంద్రబింబం ప్రతిమ చేసి బ్రాహ్మణులకు భక్తి పూర్వకంగా దానం చేస్తే.. ఎలాంటి దోషాలు ఉండవని నందిభట్ల శ్రీహరి శర్మ తెలియజేశారు. మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభ రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నట్లు తెలిపారు. ఆయన చెప్పిన జాగ్రత్తలు, పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.