అద్భుతాలు అనేవి చాలా అరుదుగా జరిగే సంఘటనలు. వీటిని కొంత మంది నమ్మినా.. మరి కొంత మంది పూర్తిగా వ్యతిరేకిస్తూ శాస్త్రియ కొన్ని కారణాలతో ఏకీభవించరు. ఇదిలా ఉంటే సహజంగా బావిలోనుంచి వచ్చే నీరంతా చాలా చల్లగా ఉంటాయనేది మనందరికీ తెలిసిన నిజం. కానీ మహబూబాబాద్ జిల్లాలోని ఓ శివాలయ బావిలోంచి మాత్రం సలసల మరిగే వేడి నీరు వస్తున్నాయి. ఈ అద్భుతాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతూ శివునికి పూజలు చేస్తున్నారు.
ఇక విషయం ఏంటంటే..? మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామం. ఈ గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతనమైన శివాలయం ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఆ ఆలయంలో ఉన్న శివాలయ బావిలోంచి నీటిని చేదుకుంటూ వచ్చే నీటిని అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆ శివాలయంలో సుగుణమ్మ అనే మహిళ పనిచేస్తూ ఉంటుంది. ఇటీవల ఓ రోజు శివాలయంలోని బావి నుంచి నీటిని తీయటం మొదలు పెట్టింది. దీంతో అలా తీసిన నీరంత వేడిగా ఉండడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది.
ఇక ఇదే విషయాన్ని ఆలయంలోని పూజారికి చెప్పడంతో గ్రామస్తులకు తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు బావి నుంచి వచ్చే నీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. గత నాలుగు నెలల నుంచి ఇలా నీరు వేడిగా వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఉన్న రోగాలు కూడా నయమైపోతున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇక శివుడి అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో శివాలయ బావి నుంచి వేడినీరు రావడంతో ఇదంతా శివుని మహిమే అంటూ స్థానికులు పూజలు చేస్తున్నారు. మరీ నిజంగానే ఇది శివుని అద్భుతమని మీరు భావిస్తున్నారా? లేదంటే ఏదైన శాస్త్రీయ కారణాల వల్ల ఇలా వేడి నీరు వస్తున్నాయా అనే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.