భారతీయ సమాజంలో పండుగలు, నోములు, వ్రతాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక మన దగ్గర ప్రతి మాసంలో ఏదో ఓ విశిష్టమైన పండుగ, వ్రతం, నోము ఉంటాయి. ఇక ఇలాంటి నోములు, వ్రతాలు పాటించే విషయంలో మన తెలుగు వారు ఓ అడుగు ముందే ఉంటారు. కొన్ని రోజులు క్రితమే అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగ జరుపుకున్నాం. ఇక ఇదే మాసంలో వచ్చే మరో అతి ముఖ్యమైన పండుగ.. అట్ల తద్ది లేదా అట్ల తధియ.
మాంగళ్య బలం కోసం గౌరీ దేవిని భక్తితో కిలిచే ఈ నోమను ఆశ్వయుజ మాసం బహుళ తదియ నాడు నోచుకోవడం సంప్రదాయం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ అట్లతద్దికి అధిక ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 12న ఈ అట్లతద్ది పర్వదినం. మరి ఈ పండుగ ప్రాధాన్యత ఏంటి.. పూజ విధానం.. నోము ఆచరించే పద్దతులు వంటి తదితర వివరాలు గురించి రమా రవి గారు సుమన్‌టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి ఈ అట్లతద్ది పండుగు పూర్తి వివరాల కోసం వీడియోని చూడండి.