మనిషికి ఏ కష్టమొచ్చినా ముందుగా భగవంతుడిని తమ కష్టాలు తొలగించాలి అంటూ స్వామి వారికి మొక్కుతుంటారు. కొంతమంది స్వామీజీలు, బాబాల వద్దకు వెళ్లి తమకు వచ్చిన ఇబ్బందుల గురించి చెప్పి వాటి పరిష్కారం గురించి వెతుకుతుంటారు.
ఈ భూమిపై దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో.. దేయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్మేవారు ఎంతో మంది ఉన్నారు. సామాన్య ప్రజలకు ఏ కష్టమొచ్చినా ముందుగా దేవుడిని తమ కష్టాలు తీర్చమొని మొక్కుతారు.. అదే విధంగా స్వామీజీలు, బాబాల వద్దకు వెళ్లి తమకు ఎవైనా దుష్టగ్రహాలు పట్టి పీడిస్తున్నాయా?వాటికి విరుగుడు మంత్రాన్ని ఉపదేశించమని అడుగుతారు. తాజాగా సుమన్ టీవీ యాంకర్ నిరుపమ భోలే నాథ్ యోగి స్వామీజీ ని ఇంటర్వ్యూ చేయగా పలు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
నా భర్త నా మాట వినడం లేదు.. అతన్ని లొంగదీసుకోవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? అని మందు పెట్టిన తర్వాత వాళ్లు మాట వింటారా? అనే ఆడవాళ్లకు మీరు ఏం సమాధానం చెబుతారు? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు స్వామీజీ సమాధానం చెబుతూ.. భర్తని లొంగదీసుకోవడానికి భార్యలు మందు పెట్టడం అనేది ఒకప్పుటి మాట.. కొన్ని మూలికలతో వ్యక్తి మూత్రం, ఇతర ద్రవ్యాలతో కలిపి తినిపించేవారు.. అలాంటివారు నా వద్దకు వచ్చారు.. వారికి శంక ప్రక్షాళన.. అంటే ప్రేగులను శుద్ది చేసి దాని పూర్తిగా తొలగించేవాళ్లం. మనుషులు చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారుతారా? పిశాచాలుగా సంచరిస్తుంటారా? ఎందుకు పిశాచాలుగా మారుతారు? అన్న ప్రశ్నకు భోలేనాథ్ స్వామీజీ సమాధానం చెబుతూ.. కర్మలు సరిగా జరగనపుడు పిశాచాలుగా మారుతుంటారు. పిశాచాలకు చీకటి అంటే ఇష్టం. అందుకే మన పెద్దలు పడుకునే సమయంలో చిన్న లైట్ అయినా వేసుకోవాలని అంటుంటారు. దీపం ఉంటే పిశాచాలు రావు. కాశీలో కాపాల భైరవి గుడిలో పిశాచాలను వదిలిస్తుంటాం.
తాంత్రిక విద్యలతో ఒక మనిషిని చంపేయడం సాధ్యమవుతుందా? అలాంటివి ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు? అన్న ప్రశ్నకు స్వామీజీ సమాధానం చెబుతూ.. క్షుద్ర పూజల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు.. ఒకరిని నాశనం చేయడం తప్పితే తాను బాగుపడటానికి అది పనిచేయదు. దేనికైనా సమయం ఉంటుంది. తర్వాత క్షుత్ర పూజలు ఫలించవు. కేవలం మానసికమైన ప్రభావం ఉంటుంది.. తప్పితే శారీరకమైన ప్రభావం ఉండదు. చేతబడి, బాణామతి కలంటే పుత్తిడి ప్రయోగం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. బెంగాల్, కేరళా వైపు ఇది ఎక్కువగా చేస్తుంటారు. శత్రువు క్షుద్ర పూజలకు లొంగకపోతే.. పుత్తడి ప్రయోగం చేస్తారు. ఈ ప్రయోగం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చేస్తుంటారు. ఇది స్త్రీలకు ఒకరకం, పురుషులకు ఒకరకంగా చేస్తారని అన్నారు.
ఇక పెళ్లైన మగవాళ్లు ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేస్తే పిశాచాలు పట్టుకుంటాయి. మానసికంగా చాలా డిస్టబెన్స్ కి గురి అవుతుంటారు. మనిషి కోరికలు తీర్చుకోవడానికి శరీరం ఉంటుంది.. సూక్ష్మ శరీరాలుగా ఉండిపోయేవి పిశాచాలు.. అందుకే ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు స్వామీజీ. స్వామీజీ అన్న మాటలకు యాంకర్ నిరుపమ ఒక్కసారిగా నివ్వెరపోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.